Video Viral: వారెవ్వ.. రోడ్డుపై ఆమ్లెట్​.. గ్యాస్​ ఆదా చేసిన మహిళ

ఈ  ఏడాది వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో చెప్పేందుకు ఈ వీడియో నిదర్శనం. సూర్యుడి వేడికి రోడ్డు పెనంలా సలసల మాడిపోతుండగా ఓ మహిళ రోడ్డుపై ఆమ్లెట్ వేశారు. ఎలాంటి పెనం లేకుండానే రోడ్డుపై గుడ్డును పగులగొట్టగా వేడికి ఆమ్లెట్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

అబ్బా  ఈ ఏడాది  ఎండలు మండిపోయాయి. నేలపై అడుగుపెడితేనే కాలిపోయింది. ఈ ఏడాది  వేడికి ఆమ్లెట్ వేసుకోవచ్చు అని ఎండల తీవ్రతను చెబుతూ మాట్లాడుకుంటారు. పె ప్రజలు ఎండల తీవ్రతకు నరకయాతన అనుభవించారు. ఎండ వేడితో   రోడ్డుపైనే ఆమ్లెట్ తయారు చేశారు. ఓ మహిళ  కోడి గుడ్డు పగలగొట్టి రోడ్డపై వేయగా అది కాస్తా.. ఆమ్లెట్ గా మారింది. ఓ వైపు ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నా ఈ వీడియోను నెటిజన్లు  ఆసక్తిగా తిలకించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by modi tejal (@tejalmodi454)

దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడితే, మరికొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. ఓ మహిళ ఎండలు ఎంతలా ఉన్నాయి అనే దానికి ఏం చేసిందో చూస్తే అవాక్కైతారు.

ఓ మహిళ ముందుగా రోడ్డు మీద కూర్చుని నీళ్లను చల్లి శుభ్రంగా తూడుస్తుంది. ఆ తర్వాత.. పాన్లో ఆమ్లెట్ వేసుకునేలా గుండ్రంగా శుభ్రపరిచి, నూనే పోస్తుంది. అనంతరం.. నవ్వుతూ ఆమె వెంట తెచ్చుకున్న రెండు కోడిగుడ్లను చూపిస్తుంది. వాటిని పగలగొట్టి రోడ్డుపై ఆమ్లెట్ వేస్తుంది. అంతేకాకుండా ఓ గరిటెతో గుండ్రంగా తిప్పుతుంది. అయితే వీడియోలో పూర్తిగా ఏమవుతుందో లేనప్పటికీ.. ఇది చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకుముందు కూడా.. ఎండలు ఎలా ఉన్నాయో అని దానికి కూడా రోడ్డుపై కోడి గుడ్లతో ఆమ్లెట్ వేసి చూపించారు. ఆ వీడియో కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియో ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వీక్షించారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందించారు. ఇలాంటి పనులతో రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ప్రమాదం ఉందని.. వారు సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం ఎదుటి వారి జీవితాలతో ఆడుకోవద్దని.. పలువురు నెటిజన్లు తెలుపుతున్నారు.