ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్‌ను ఇలా కూడా వాడతారా..

జనాలకు రోజు రోజుకు సోషల్​ మీడియా పిచ్చి ముదురుతుంది.  ఏదో ఒక విధంగా  ఫేమస్​ అయ్యేందుకు రకరకాల చేష్టలు చేస్తున్నారు.  ఆ మధ్య ఇస్త్రీ పెట్టెపై దోస.. ఎండ వేడిలోఆమ్లెట్​ వేయడం ఇలా అనేక రకాల వీడియోలు అయ్యాయి. ఇప్పుడు మరీ విచిత్రంగా దోమల బ్యాట్​పై బ్రెడ్​ రోస్ట్​ చేస్తున్న వీడియో ఇంటర్​ నెట్​ లో హల్​ చల్​ చేస్తుంది.. వివరాల్లోకి వెళ్తే...

ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో జుగాడ్‌ కొత్త కొత్త వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మన భారతీయులు ఇలాంటి జుగాడ్‌ పనుల్లో ఎల్లప్పుడూ ముందుంటారు. మనవాళ్లకు అలాంటి ట్రిక్స్‌ చాలా సాధారణం. చిన్న టెక్నిక్‌తో ఏ పనినైనా సింపుల్‌గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇస్త్రీ పెట్టెపై దోస.. ఎండ వేడిలోఆమ్లెట్​ వేయడం వంటి చాలా వీడియోలు చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటిదే మరో కొత్త వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇప్పుడు, దోమల రాకెట్‌పై ఒక మహిళ బ్రెడ్ టోస్ట్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో jolil7565 అనే ఇన్​స్ట్రా ఖాతానుంచి పోస్ట్​ అయింది. 

వైరల్‌ వీడియో క్లిప్‌లో మహిళ దోమల రాకెట్‌పై మంచం మీద కూర్చొని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత, ఆమె దానిపై బ్రెడ్ ముక్కలను కాల్చింది. క్లిప్ చివరిలో, ఆమె బ్రెడ్ టోస్ట్ రుచి చూస్తుంది. వీడియోను షేర్‌ చేస్తూ..బ్రెడ్ టోస్ట్ చేయడానికి ఇది కొత్త టెక్నిక్ అని మహిళ రాసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూసిన వారు  బ్రెడ్ విత్ మస్కిటో శాండ్‌విచ్ అని  ఫన్నీగా ఒకరు కామెంట్​ చేశారు.  మరొకరు స్పందిస్తూ.. ఈ ఆలోచన పేయింగ్ గెస్ట్‌లుగా ఉండేవారికి ఉపయోగపడుతుందని అన్నారు. మరికొందరు ఈ వంటకానికి మచ్చర్ టోస్ట్  అని పేరు పెట్టారు. మరికొందరు వీడియో ఎడిట్ చేశారని ఆరోపించారు. మరో వ్యక్తి ఈ మహిళ గ్యాస్‌ను ఆదా చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.