కరీంనగర్ లో మిస్సింగ్ కలకలం.. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

 కరీంనగర్ జిల్లా రేకుర్తిలో మిస్సింగ్ కలకలం రేపుతోంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైంది.తన భార్య గోదా భాగ్యలక్ష్మి(40)తోపాటు కూతురు ఆదిత్య లక్ష్మి(12), కుమారులు విశ్వక్ సేన్(8), అశ్వత్ కార్తికేయ(3)లు మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయారని భర్త గోదా కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

బంధువుల ఇళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఆరా తీసిన భార్య, పిల్లల ఆచూకి దొరక్కపోవడంతో  కృష్ణ, పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.