సోషల్ మీడియా వచ్చిన తరువాత జనాలు తెగ హడావిడి చేస్తున్నారు. కొంతమంది సాహసాలు చేసి పాపులర్ అయితే మరి కొంతమంది వంటింటి చిట్కాలు ఉపయోగించి సోషల్ మీడియాలో పరుగులు పెడుతున్నారు. ప్రతి రోజు తిన్నా సరే.. సోషల్‌మీడియాలో ఏదైనా వంటకం పోస్ట్ అయితే చాలు.. వైరల్ అవుతుంది. దానికి తగ్గట్టే జనాలు కూడా ఐటం పాతదైనా.. కొత్త పద్దతులు జోడించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అలాగే చపాతీ, పూరీ వంటకం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో ఏముందంటే...
చపాతీలు, పూరీలు చేయాలంటే పిండిని చిన్న చిన్న ఉండలు చేసి .. రోలింగ్ పిన్‌తో పల్చగా చేసిన తరువాత పెనంపై కాల్చడం.. లేదా నూనెలో వేయిస్తారు. ఇదంతా పాత పద్దతి అంటుంది ఓ మహిళ. చపాతీ.. పూరీలు చేయడానికి అసలు రోలింగ్పిన్ అవసరం లేకుండా తయారు చేశారు. అంతే కాదు.. చాలా తక్కువ సమయంలో చపాతీలు.. పూరీలు తయారు చేసే ప్రక్రియను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇంటర్ నెట్ లో సంచలనం సృష్టించింది.
మెత్తగా తయారైన పూరీ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి .. ఒక దానికొకది దూరంగా ప్లాస్టిక్ షీట్ లోని సగ భాగంలో ఉంచారు. మిగతా సగ భాగాన్ని ఆ వుండలపై కప్పి.. . దానిపై రోలింగ్ బోర్డుతో నొక్కారు. ఈ వీడియోను Instagram వినియోగదారు రుచీ కేవాట్ (@itz_ruchi___123) పోస్ట్ చేసారు.దీనికి “బినా బెలన్ కి పూరీ (రోలింగ్ పిన్ లేని పూరిస్)” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఈ మహిళను అభినందించారు. ... ఇది అద్భుతం.. దీనిని నేను కూడా ప్రయత్నిస్తానని కామెంట్ చేశారు. ఇంకొకరు సూపర్ ఆలోచన అని ప్రశంశించారు. ఈ పూరీ ట్రిక్ ను అనుసరించాలంటూ మూడో వ్యక్తి రాశారు. కొంతమంది.. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తొందరగా పూరీలు తయారు చేసేందుకు ఈ ట్రిక్ చాలా ఉపయోగమని రాసుకొచ్చారు.