రాములోరి మీద ప్రేమతో..గుడి కోసం ఉపవాసం

రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం కట్టాలనేది భక్తుల కోరిక. వందేండ్ల పోరాటం తర్వాత ఆ కోరిక నెరవేరుతుండడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఇప్పటికే గుడి కోసం దీక్షపూనిన కొందరు జనవరి 22న విరమించుకోనున్నారు. మరికొందరు భక్తితో తమ వంతుగా రామ మందిరానికి బహుమతులు ఇస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ.

గుడి కోసం ఉపవాసం

అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం జరగాలని శపథం చేసింది 81 ఏండ్ల ఊర్మిళ చతుర్వేది. అది వట్టి మాటలతో చేసిన శపథం చేసి వదిలేయలేదు. దేవాలయ నిర్మాణం జరిగేవరకు ఉపవాసం ఉంటానని శపథం చేసింది. 28 ఏండ్లుగా ఉపవాసం ఉంటోంది. 54 ఏండ్ల వయసులో ఉపవాసాన్ని మొదలుపెట్టింది.

అప్పటి నుంచి పాలు, పండ్లు తప్ప మరేమీ తీసుకోలేదామె. ఇన్నేండ్లలో ఆమెని ఆహారం తీసుకోమని ఎంతమంది బలవంతం చేసినా భక్తి, శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగించింది. అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేశారు. 2020 ఆగస్టు5న రామమందిరం భూమి పూజ జరిగిన రోజున ఉపవాసం విరమించింది. నవరాత్రి ఐదో రోజున 84 ఏండ్ల వయసులో  చనిపోయింది.