చలికాలం వచ్చిందని స్టైల్ గా తయారు కాకుండా ఉంటారా ఏంటి? సీజనికి తగ్గట్టు స్టైలింగ్ కంపల్సరీ. ఆ స్టైలింగ్ కూడా ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటే లుక్ అదిరిపోతుంది.
స్వెటర్ తెలుసు.. షర్టు కూడా తెలుసు.. మరి ఈ స్వెటర్ షర్ట్స్ ఏంటి అంటారా! షర్ట్స్ మాదిరిగానే ఉండే స్వెటర్స్ ఇవి. జీన్స్, లెగ్గింగ్స్, స్కర్ట్స్ .. ఇలా వేటిమీదైనా ఈ స్వెటర్ షర్ట్స్ ని మ్యాచ్ చేయొచ్చు.
బోలెడు డిజైన్స్, డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉండే స్వెటర్ షర్ట్స్ చలి నుంచి కాపాడుతూనే స్టైలిష్ లుక్ ఇస్తాయి. వీటి ధర రూ.500 నుంచి మొదలవుతుంది.