Good Health : చలికాలంలో చర్మంపై పగుళ్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉంది..!

వేసవిలో ఎండ తగలకుండా చర్మాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో... చలికాలం అంతకంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... వేసవిలో కంటే చలికాలంలోనే స్కిన్ ఎక్కువగా దెబ్బతింటుంది. అతిగా పొడిబారడం వల్ల పగులుతుంది. కొందరిలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. పగిలిన చర్మాన్ని అలాగే వదిలేస్తే అది రకరకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మొదట దురదతో మొదలవుతుంది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగి... పగుళ్లు పెద్దవి కావడం, ఆ పగుళ్లే బ్యాక్టీరియాలకు ఆవాసాలుగా మారడంతో సమస్య మరింత పెద్దదవుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read :- ఇది చక్కెర లాంటి కృత్రిమ చక్కెర.. ఆరోగ్యం అని ఎక్కువ వాడితే అనారోగ్యం తెలుసా..!

 నీళ్లను ఎక్కువగా తాగడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించడం వంటి చర్మ సంరక్షణ పద్ధతులను పాటించాలి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే.. గరుకైన దుస్తులు కాకుండా మెత్తని దుస్తులను నిండుగా వేసుకొని వెళ్లాలి. గరుకైన దుస్తులతో చర్మం మరింతగా దెబ్బతింటుంది.

–వెలుగు, లైఫ్​–