Beauty Tips : చలికాలంలో మీ చర్మ సౌందర్యాన్ని ఇలా కాపాడుకోండి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిగనిగలాడుతుంది

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు క్యూ కడతాయ్. చర్మం పొలుసులు ఊడుతూ, డ్రైగా మారి తెగ ఇబ్బంది పెడుతుంది. డ్రై స్కిన్ ఉన్నవాళ్లకైతే ఈ రకమైన ఇబ్బందులు మరీ ఎక్కువ! అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడి చర్మాన్ని అందంగా... ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా?

వేడినీళ్లతో స్నానం..: చలికాలంలో వేడినీళ్ల స్మానాన్ని అందరూ ఇష్టప డుతుంటారు. కానీ వేడి నీళ్లు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయ్. అందువల్ల కాలంలో గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి. స్నానం అయిన తర్వాత చర్మం కొంచెం తడిగా ఉన్న పుడే పెదవులకు, ఒంటికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి.

వీలైనంత ఎక్కువగా నీళ్లు : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం పల్ల చాలామంది నీళ్లు ఎక్కువగా తాగరు. దానివల్ల చర్మం డిహైడ్రేట్ అవుతుంది.  అలా కాకుండా ఉండాలంటే కచ్చితంగా రోజుకి 8 గ్రాసుల నీళ్ల తాగాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలి. అదే విధంగా సీజనల్ ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. దీనికి తోడు వ్యాయామం కూడా కంపల్సరీగా చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి.

డాక్టర్​ ను  సంప్రదించాలి..చర్మం పొడిగా ఉన్నప్పుడు పొలుసులుగా మారి దురదలాంటిది మొదలువుతుంది. దానివల్ల పదే పదే గోకడం చేస్తుంటారు. దాంతో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి చలికాలంలో చర్మానికి సంబంధించి ఏ చిన్న ఎలర్జీ ఉన్నా.. డెర్మటాలజిస్ట్ సంప్రదించడం మంచిది. అలాగే చలిలో సాధ్యమైనంతవరకు చర్మాన్ని బయటి వాతావరణంతో కనెక్ట్ కాకుండా చూసుకోవాలి. దుమ్ము, దూళికి దూరంగా ఉండాలి. పౌడర్లు వేసుకోవద్దు.

ALSO READ | Beauty Tips : చలికాలంలో మీ చర్మ సౌందర్యాన్ని ఇలా కాపాడుకోండి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిగనిగలాడుతుంది

సబ్బుల వాడకంలో జాగ్రత్తలు: ఈ కాలంలో చర్మానికి ఎక్కువ పోషణ అవసరం. అందువల్ల మామూలు సబ్బులకు బదులు గ్లిజరిన్, రోజ్ వాటర్ తో  తయారైన సబ్బులు, ఫేస్ వాష్​ లు  వాడడం మంచిది. దీని వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది. అలాగే వారానికి ఒక సారి సున్నిపిండి వాడడం మంచిది. చిన్న పిల్లలకు వాడే సబ్బులు వాడినా శరీరానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. 


ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుకో వడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించవచ్చు. వీటివల్ల చర్మం అందంగా, తేమగా మారుతంది.

కొబ్బరి నూనె..  స్నానం చేసే నీళ్లలో అర టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి స్నానం చేస్తే చర్మం పొడిగా మారదు అదే విధంగా స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ లో కాస్త కొబ్బరి నూనె వేసి చర్మాన్ని మర్దనా చేసినా చర్మం తాజాగా ఉంటుంది.

కార్న్ ఫ్లోర్ తోనూ..: చలికాలంలో మొక్కజొన్న పిండి, పెరుగు కలిపి స్నానానికి ముందు చర్మంపై రాయాలి. ఆరాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల వచ్చే మార్పుని మీరేగమనించొచ్చు.
ఆరెంజ్ తో..:  ఈ  తొక్కలను ఎండబెట్టి పేస్ట్ చేసి ముఖం, చేతులకి రాసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల  పొడిబారే సమస్య త్వరగా తగ్గడమే కాకుండా చర్మం అందంగా అవుతుంది.
టొమాటో గుజ్జుతో.. :  టొమాటో గుజ్జుని తీసుకుని అందులో కొంచెం పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం డ్రైగా మారడం తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న గాయాలు. .. వాటి తాలూకు మచ్చలు కూడా తగ్గిపోతాయి. 
కొబ్బరి నూనె, నిమ్మరసం..:  కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా, కాంతి వంతంగా మారుతుంది. వారానికి ఓ సారి నువ్వుల నూనెతో మర్దనా చేసినా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
తేనె, నిమ్మరసం మిశ్రమం.. : ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో తేనె, నిమ్మ రసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మం అందంగా మారడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి పోతాయి

ఆల్కహాల్ ఫ్రీ లోషన్స్ ఎంచుకోవాలి

చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి రకరకాల లోషన్స్, టోనర్స్, బాడీ క్రీమ్స్ వాడుతుంటారు. కానీ ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ శాతం ఆల్కహాల్ తయారవుతాయ్. దానివల్ల స్కిన్ ఇంకా డ్రైగా మారుతుంది. అందువల్ల కొనేటప్పుడే అల్కహాల్ తక్కువగా ఉన్న ప్రాడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి

సన్ స్క్రీన్ బెటర్

చలికాలం కదా అస్సలు ఎండ ఉండదు.. ఉన్నా అదేమంత పెద్ద ఎఫెక్ట్​ చూపదులే..! అని అనుకుంటే పొరపాటే.. చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువుగా ఉంటుంది. కాని అది మనకు తెలియకపోవచ్చు. అందుకని బయటకు వెళ్లేముందు సన్​ స్క్రీన్​ లోషన్‌స్​ తప్పనిసరిగా రాసుకోవాలి.  మందారం.. మల్లె.. గులాబీ లాంటి ప్లవర్​ బేస్డ్​ లోషన్స్​ ను ఎంచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

–వెలుగు, లైఫ్​–