15 రోజుల్లో వీసీలు..వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లనూ నియమిస్తం : సీఎం రేవంత్​

  • నిరుద్యోగుల సమస్యలు వింట.. అన్నగా అండగా ఉంట
  • బీఆర్​ఎస్​ మాయమాటలు నమ్మి నిరసనలు చేపట్టొద్దు
  • విద్యార్థుల ప్రాణాలు తీసి పదేండ్లు పాలించినోళ్లు రిక్రూట్​మెంట్లను ఎందుకు పట్టించుకోలే?
  • ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు పోయే సరికి మళ్లీ విద్యార్థులను రెచ్చగొడ్తున్నరు
  • ఉద్యమంలో ప్రధానాంశం నిరుద్యోగమే.. విద్య, ఉద్యోగాలు, రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం
  • గత ప్రభుత్వానికి ఫామ్​హౌస్​లు, జనాలకు ఉపయోగం లేనివే ప్రాధాన్యమని విమర్శ
  • సివిల్స్ మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సెలెక్టయిన 135 మందికి రూ.ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ష చొప్పున చెక్కులు అందజేత
  • సివిల్స్​ ఇంటర్వ్యూకు సెలెక్ట్​ అయితమరో రూ. లక్ష ఇస్తామని భరోసా

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఫామ్​హౌస్​లు, ప్రజలకు ఉపయోగం లేని కార్యక్రమాలను ప్రాధాన్యంగా పెట్టుకుంటే... తమ ప్రభుత్వం విద్యా, ఉద్యోగాలు, వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాయం, రైతు సంక్షేమమే ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘విద్యార్థుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెచ్చగొట్టి, వారి ప్రాణాలు తీసి రాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీయ ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ధి పొంది, అధికారంలోకి వచ్చినోళ్లు.. ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేండ్ల పాటు ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు పోగానే మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ్లీ విద్యార్థుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెచ్చగొట్టే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నికి పూనుకున్నరు” అని బీఆర్​ఎస్​ నేతలపై మండిపడ్డారు.

 ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిహేను రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వైస్  చాన్స్​లర్లు,  ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లను నియమిస్తామని సీఎం ప్రకటించారు. విద్యార్థుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిరుద్యోగుల స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యలు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కరించేందుకు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అన్నగా తాను అండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డతాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆయన హామీ ఇచ్చారు. 

తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌‌‌‌కు అర్హత సాధించిన 135 మందికి సోమవారం సెక్రటేరియెట్​లో రాజీవ్ సివిల్స్ అభ‌‌‌‌య హ‌‌‌‌స్తం కింద రూ.ల‌‌‌‌క్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను సీఎం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమంలో ప్రధాన అంశం నిరుద్యోగ‌‌‌‌మేన‌‌‌‌ని.. నిరుద్యోగులు, విద్యార్థుల ఉద్యమాలతోనే  రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు.  రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వ‌‌‌‌చ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామ‌‌‌‌కాలు చేప‌‌‌‌ట్టామ‌‌‌‌ని.. గ్రూప్‌‌‌‌-1, 2, 3, డీఎస్సీతో క‌‌‌‌లిపి మ‌‌‌‌రో 35వేల ఉద్యోగాల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేష‌‌‌‌న్లు ఇచ్చి చిత్తశుద్ధి చాటుకున్నామ‌‌‌‌ని సీఎం వివరించారు. 

సెక్రటేరియెట్..​గడీ కాదు

గ‌‌‌‌తంలో(బీఆర్​ఎస్​ హయాంలో) సెక్రటేరియెట్​లోకి త‌‌‌‌న‌‌‌‌ను, సీత‌‌‌‌క్కను కూడా రానివ్వలేద‌‌‌‌ని, సెక్రటేరియెట్​ అంటే గడీలా భావించారని సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘సెక్రటేరియెట్​ గ‌‌‌‌డీ కాదు.. మీరు దూరం నుంచి దీన్ని చూసే ప‌‌‌‌రిస్థితి రావ‌‌‌‌ద్దు.. మా బిడ్డలే అని చెప్పేందుకే ఈ కార్యక్రమం సెక్రటేరియేట్​లో ఏర్పాటు చేసుకున్నం” అని రాజీవ్​ సివిల్స్​ అభయ హస్తం ఆర్థిక సాయానికి ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి ఆయన అన్నారు. గ‌‌‌‌త ప్రభుత్వం ఇటువంటి ఆర్థిక సాయం అందజేసే ప‌‌‌‌నులు ఏమీ చేయ‌‌‌‌లేద‌‌‌‌ని..  

విద్యార్థులకు, విద్యా రంగానికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నా కొంద‌‌‌‌రు కుట్రలు చేస్తున్నార‌‌‌‌ని ఆయన తెలిపారు. ఉద్యోగాల భర్తీ కోసం తాము నోటిఫికేషన్లు ఇస్తుంటే..  ప‌‌‌‌రీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థుల‌‌‌‌ను బావాబామ్మర్దులు (హరీశ్​, కేటీఆర్​) రెచ్చగొట్టారని.. ఆ బావా బామ్మర్దులనే ఆమ‌‌‌‌ర‌‌‌‌ణ దీక్ష చేయాల‌‌‌‌ని తాను సూచించాన‌‌‌‌ని సీఎం చెప్పారు. కొంద‌‌‌‌రి మాయ‌‌‌‌మాట‌‌‌‌ల ప్రభావంలో ప‌‌‌‌డి నిర‌‌‌‌స‌‌‌‌న‌‌‌‌లు, ధ‌‌‌‌ర్నాల‌‌‌‌కు దిగొద్దని నిరుద్యోగులకు సూచించారు. ప్రభుత్వం దృష్టికి ఏ స‌‌‌‌మ‌‌‌‌స్యలు తీసుకువ‌‌‌‌చ్చినా సానుకూల దృక్ఫథంతో ప‌‌‌‌రిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గత సర్కార్​లో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం

గ‌‌‌‌త బీఆర్ఎస్​ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌‌‌‌ని సీఎం అన్నారు. వ‌‌‌‌స‌‌‌‌తి గృహాల‌‌‌‌ను అద్దె భ‌‌‌‌వ‌‌‌‌నాల్లో నిర్వహించార‌‌‌‌ని, వంద‌‌‌‌ల మంది విద్యార్థులుంటే ఒక‌‌‌‌ట్రెండు బాత్‌‌‌‌రూంల‌‌‌‌తో స‌‌‌‌రిపెట్టార‌‌‌‌ని మండిపడ్డారు. తాము మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌‌‌‌స‌‌‌‌తిగృహాల‌‌‌‌న్నీ ఒకే కాంపౌండ్‌‌‌‌లో ఉండేలా 20 నుంచి 25 ఎక‌‌‌‌రాల్లో రాష్ట్రంలో వంద నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌‌‌‌ల్స్ పేరుతో నిర్మిస్తున్నామ‌‌‌‌ని ఆయన తెలిపారు. 

ఇందుకోసం బ‌‌‌‌డ్జెట్‌‌‌‌లో రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు. ‘‘కేంబ్రిడ్జి, ఆక్స్‌‌‌‌ఫ‌‌‌‌ర్డ్‌‌‌‌, ఉస్మానియాలో చ‌‌‌‌దువుకున్నవాళ్లు ఆ విద్యా సంస్థల గురించి గ‌‌‌‌ర్వంగా చెప్పుకుంటారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌‌‌‌ల్ స్కూల్స్‌‌‌‌లో చ‌‌‌‌దువుకున్నామ‌‌‌‌ని విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా ఆ స్కూల్స్​ను తీర్చిదిద్దుతాం” అని ఆయన పేర్కొన్నారు. 

సివిల్స్​ ఇంటర్వ్యూకు సెలెక్ట్​ అయితే మరో లక్ష

ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసిన వారంతా మెయిన్స్‌‌‌‌కు, ఆ త‌‌‌‌ర్వాత ఇంట‌‌‌‌ర్వ్యూకు అర్హత సాధించాల‌‌‌‌ని.. అంతిమంగా సివిల్స్‌‌‌‌కు ఎంపిక కావాల‌‌‌‌ని సీఎం రేవంత్​ ఆకాంక్షించారు.  సివిల్స్​లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటాలని సూచించారు. ప్రస్తుతం సివిల్స్​ మెయిన్స్‌‌‌‌కు అర్హత సాధించిన వారికి రూ.ల‌‌‌‌క్ష సాయం అందించామ‌‌‌‌ని, మెయిన్స్‌‌‌‌లో ఉత్తీర్ణులై ఇంట‌‌‌‌ర్వ్యూకు అర్హత సాధిస్తే మ‌‌‌‌రో రూ.ల‌‌‌‌క్ష అందిస్తామ‌‌‌‌ని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.ల‌‌‌‌క్ష పెద్ద మొత్తం కాక‌‌‌‌పోవ‌‌‌‌చ్చని, కానీ ఈ ప్రభుత్వం మీ వెనుక ఉంద‌‌‌‌నే ఆత్మవిశ్వాసం క‌‌‌‌ల్పించ‌‌‌‌డానికి భ‌‌‌‌రోసా ఇస్తున్నామ‌‌‌‌ని సివిల్స్​ స్టూడెంట్స్​తో అన్నారు. 

సివిల్స్ ప్రిలిమ్స్‌‌‌‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్‌‌‌‌, ఇంట‌‌‌‌ర్య్వూ, ఎంపిక వ‌‌‌‌ర‌‌‌‌కు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా త‌‌‌‌న‌‌‌‌కు, మంత్రుల‌‌‌‌కు తెలియ‌‌‌‌జేయాల‌‌‌‌ని.. రాష్ట్ర ప్రభుత్వం త‌‌‌‌ర‌‌‌‌ఫున వాటిని ప‌‌‌‌రిష్కరిస్తామ‌‌‌‌ని చెప్పారు. ఎస్సై నియామ‌‌‌‌కాలు చేప‌‌‌‌డితే స‌‌‌‌గం మంది ఉమ్మడి న‌‌‌‌ల్గొండ నుంచే ఎంపిక అవుతున్నార‌‌‌‌ని, అందుకు కార‌‌‌‌ణం ముందుగా అక్కడి నుంచి ఎంపికైన వారి స్ఫూర్తేన‌‌‌‌ని ఆయన అన్నారు. 

‘‘సివిల్స్​లో మీ ఎంపిక‌‌‌‌లు మీ కుటుంబానికి, మీ ఊరుకు, మీ జిల్లాకే కాక తెలంగాణ‌‌‌‌కు గ‌‌‌‌ర్వకార‌‌‌‌ణ‌‌‌‌మ‌‌‌‌నే విష‌‌‌‌యం గుర్తుంచుకోవాలి.  ద్రౌప‌‌‌‌ది స్వయంవ‌‌‌‌రం స‌‌‌‌మ‌‌‌‌యంలో అర్జునుడి ల‌‌‌‌క్ష్యం చేప క‌‌‌‌న్నుపై కేంద్రీకృత‌‌‌‌మైన‌‌‌‌ట్లే సివిల్స్‌‌‌‌లో ఎంపిక కావ‌‌‌‌డ‌‌‌‌మ‌‌‌‌నే ఏకైక ల‌‌‌‌క్ష్యమే మీకు ఉండాలి. కుటుంబ‌‌‌‌, ఆర్థిక‌‌‌‌, ఇత‌‌‌‌ర స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌ను ప‌‌‌‌ట్టించుకోవ‌‌‌‌ద్దు. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని ఆయన భరోసా ఇచ్చారు.

ఎవరూ ఆలోచించని విధంగా ముందుకు : భట్టి 

గతంలో రాష్ట్రాన్ని పాలించిన వారెవరు ఆలోచించని విధంగా  సీఎం  రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. అందులో భాగంగా తొలి ఏడాదే రూ. ఐదు వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కు కేవలం ఏడాదికి రూ. మూడు కోట్లు మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేసిందని.. 

ఈ సంవత్సరం తాము  రూ.5 వేల కోట్లకు పెంచామని వివరించారు. అంగన్వాడీలు, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులను ప్రోత్సహించి.. రాష్ట్ర, దేశాభివృద్ధికి దోహ దం చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాక‌‌‌‌ర్‌‌‌‌, శ్రీ‌‌‌‌ధ‌‌‌‌ర్ బాబు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబ‌‌‌‌శివ‌‌‌‌రావు, కోరం క‌‌‌‌న‌‌‌‌క‌‌‌‌య్య, మాలోత్ రాందాస్ నాయ‌‌‌‌క్‌‌‌‌, మ‌‌‌‌ట్టా రాగ‌‌‌‌మ‌‌‌‌యి, గండ్ర స‌‌‌‌త్యనారాయ‌‌‌‌ణ‌‌‌‌రావు, గ‌‌‌‌డ్డం వివేక్ వెంక‌‌‌‌ట‌‌‌‌స్వామి, క‌‌‌‌వ్వంప‌‌‌‌ల్లి స‌‌‌‌త్యనారాయ‌‌‌‌ణ‌‌‌‌,  ఎంపీలు గ‌‌‌‌డ్డం వంశీకృష్ణ, రామ‌‌‌‌స‌‌‌‌హాయం ర‌‌‌‌ఘురాంరెడ్డి,  సీఎస్ శాంతి కుమారి, సింగ‌‌‌‌రేణి సీఎండీ బ‌‌‌‌ల‌‌‌‌రాం తదితరులు పాల్గొన్నారు.  

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి గృహాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నీ ఒకే కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండేలా, 20 నుంచి 25 ఎక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్స్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. 100 నియోజకవర్గాల్లో నిర్మాణం కోసం బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాం. కేంబ్రిడ్జి, ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉస్మానియాలో చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దువుకున్నవాళ్లు ఆ విద్యా సంస్థల గురించి గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వంగా చెప్పుకుంటారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దువుకున్నామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా ఆ స్కూల్స్​ను తీర్చిదిద్దుతాం.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎం రేవంత్​

ఈ ఏడాది స్కిల్ వర్సిటీలో 2 వేల మందికి శిక్షణ

వేలాది మంది ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసినా కంపెనీల‌‌‌‌కు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన నైపుణ్యాలు వారిలో ఉండ‌‌‌‌డం లేద‌‌‌‌ని, మ‌‌‌‌రోవైపు కంపెనీల‌‌‌‌కు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన నైపుణ్యం ఉన్న వాళ్లు ల‌‌‌‌భించ‌‌‌‌క కంపెనీలు ఇబ్బందులు ప‌‌‌‌డుతున్నా య‌‌‌‌ని సీఎం రేవంత్​ అన్నారు. ఈ స‌‌‌‌మ‌‌‌‌స్య ప‌‌‌‌రిష్కారానికి, నిరుద్యోగ స‌‌‌‌మ‌‌‌‌స్య నిర్మూలన‌‌‌‌కు యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌‌‌‌ర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

స్కిల్​ వర్సిటీలో ఈ ఏడాది 2 వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామ‌‌‌‌ని, వ‌‌‌‌చ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ అందుతుందని వివరించారు. మొన్నటి ఒలింపిక్స్‌‌‌‌లో  140 కోట్ల జ‌‌‌‌నాభా ఉన్న మ‌‌‌‌న దేశం మాత్రం ఆశించిన స్థాయిలో ప‌‌‌‌త‌‌‌‌కాలు సాధించ‌‌‌‌లేద‌‌‌‌ని, ఇది ఒక ర‌‌‌‌కంగా మ‌‌‌‌న‌‌‌‌కు బాధాకరమని సీఎం అన్నారు. మ‌‌‌‌న యువ‌‌‌‌త పెద్ద సంఖ్యలో ప‌‌‌‌త‌‌‌‌కాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌‌‌‌ర్సిటీకి రూప‌‌‌‌క‌‌‌‌ల్పన చేస్తున్నట్లు వివరించారు. 

సివిల్స్ మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సెలెక్టయిన అభ్యర్థికి రూ.లక్ష చెక్​ అందజేస్తున్న సీఎం రేవంత్​ రెడ్డి, 
మంత్రులు పొన్నం ప్రభాకర్​, శ్రీధర్​బాబు, ఎంపీ వంశీకృష్ణ తదితరులు