మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..

పండగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. సంతోషం వచ్చినా.. దు:ఖం వచ్చినా.. ఓ పెగ్ వేయాల్సిందే.. బీరు బాటిల్ ను పొంగించాల్సిందే.. సరదాగా నలుగురు కలిసినా అదే పని.  ఇలా చేయడం వలన  జీవితం నిర్వీర్యం అవుతుందని తెలిసినా మద్యానికి బానిస అవుతారు.  అరేయి ఇక వద్దురా బాబూ.. తాగింది చాలు ఇక ఆపరా అని మన శరీరం హెచ్చరిస్తున్నా.. పలు సిగ్నల్స్ పంపుతున్నా.. అవేం పట్టించుకోకుండా నా సామిరంగా అంటూ మద్యం తాగుతూనే ఉంటారు.  కాని చాలా మందికి మద్యం తాగితే వాంతులు అవుతాయి.. అయినా సరే పట్టించుకోకుండా పీకలదాకా తాగుతారనుకోండి.. మద్యం తాగితే వాంతులు ఎందుకు అవుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

చాలామంది మద్యం తాగిన తరువాత వాంతులు చేసుకుంటారు.  ఆల్కహాల్ శరీరంలోకి  వెళ్లిన తరువాత  ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్దం విడుదలవతుంది.  ఇది పొట్టలో వికారాన్ని కలుగజేస్తుంది.  కడుపులో తిప్పుతూ... వాంతులను ప్రేరిస్తుంది.   ఈ రసాయనం శరీరంలో రిలీజైనప్పడు .. ఇక తాగొద్దు వాంతులవుతాయని బ్రెయిన్ రెడ్ సిగ్నల్స్ ఇస్తుంది.  అయినా సరే  తాగామా..  వెళ్లేది ఇంటికాదు.. నేరుగా మనుషులను రిపేర్ చేసే షెడ్డుకు.. అదేనండి ఆస్పత్రికి.  మందు తాగేటప్పుడు కెపాసిటీని బట్టి తాగాలి.. కొందరికి కిక్కు త్వరగా ఎక్కితే... మరికొందరికి లేట్ అవుతుంది.

అతిగా మద్యం సేవిస్తే వాంతులే కాదు .. చాలా దుష్ప్రభావాలుంటాయి.  మెదడులో నరాలు దెబ్బతినడం.. లివర్ డ్యామేజ్ అవుతుంది.ఇంకా శరీరంలోని అన్ని పార్టులను దెబ్బతీస్తుంది.   తలనొప్పి, మైకం, నీరసం, బద్దకం వంటివి ఉంటాయి.అంటే..  మీ బాడీ సామర్థం కంటే మీరు ఎక్కువ ఆల్కాహాల్ తీసుకున్నారని... ప్రజంట్ అయితే..  హ్యాంగోవర్‌ను తప్పించుకోవడానికి ఎలాంటి మెడిసిన్స్ లేవు.  లివర్.. గంటకు 8 నుంచి 12 గ్రాముల మధ్య ఆల్కహాల్‌ను బ్రేక్ చేస్తుంది. మీరు హ్యాంగోవర్‌‌లో ఉన్నారంటే.. మీ లివర్ ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ చేయలేదు. అప్పుడు ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో బీ కేర్ ఫుల్. . .