Summer Alert : ఎండల్లో తిరుగుతున్నా.. కొంత మందికి వడ దెబ్బ ఎందుకు రాదు.. కారణాలు ఏంటీ..?

ఎండకు అలవాటు అయినోళ్లకు వడదెబ్బ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారుతుంది. సడెన్ గా దానికి ఎక్స్ పోజ్ అయినోళ్లకు హీట్ స్ట్రోక్ వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు ఎందుకు రావడం లేదంటే.. వాళ్లు ఆ ఉష్ణోగ్రతకు నెమ్మదిగా అలవాటుపడతారు. వరుసగా కొన్ని గంటలపాటు ఎండలో పని చేస్తే వాళ్లకు కూడా హీట్ స్ట్రోక్ వస్తుంది. కాబట్టి వాళ్లకు వడదెబ్బ తగలొద్దంటే... అర గంటకు ' ఒకసారి నీడకు వచ్చిపోతుండాలె. పని చేస్తూనే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఎండకు ఎట్ల అలవాటు పడాలి?

ఒకేసారి వరుసగా అన్ని గంటలు ఎండలో ఎవరూ పని చేసినా.. కచ్చితంగా ఎండ సెగ తాకుతది. కాబట్టి కొద్దికొద్దిగా ఎండకు అలవాటయ్యేలా చూసుకోవాలి. రోజుకి అరగంట చొప్పున పెంచుకుంటూ పోవాలి. దీన్నే ఎక్స్ లిమిటైజేషన్ అంటరు. ముఖ్యంగా అథ్లెట్లకు.. బయట పని చేసే వాళ్లకు ఇది వర్తిస్తుంది.