యువతలో గుండె జబ్బులు.. పెరగటానికి కారణాలు.. ఎందుకిలా ..!

ఇటీవల కాలంలో యువకుల్లో గుండె సంబంధించిన మరణాలు బాగా పెరిగిపోతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్ తో కుప్పుకూలిపోతున్నారు. ఆటలాడుతూ ఒకరు.. మాట్లాడుతూ మరొకరు.. స్నానం చేస్తూ ఇంకొకరు.. పనిచేస్తూ.. ఇలా చాలామంది యువత గుండె సంబంధ సమస్యలతో చనిపోతున్నారు. 

ఈ ధోరణి పెరిగిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. డాక్టర్లు కూడా ఇలాంటి ఆకస్మిక మరణాలపై సీరియస్ గా దృష్టిసారించాల్సి వస్తోంది. ఇంతకీ యువకుల్లో కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధిత సమస్యలు ఎందుకు ఎక్కువవుతున్నాయి.. దీనికి గల కారణాలేంటీ.. ఈ సమస్యను అధిగమించేందుకు డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 

యువకుల్లో గుండె సంబంధ సమస్యలతో మరణాలు పెరగడానికి ఐదు ప్రధాన కారణాలున్నాయని చెబుతున్నారు డాక్టర్లు.. అవేంటో చూద్దాం.

జీవనశైళీ.. 

యువకుల్లో గుండె సంబంధింత సమస్యలు, మరణాలకు ప్రధాన కారణం వారి జీవన శైలి అంటున్నారు డాక్టర్లు. నేటి పోటీపడుతూ పరుగులు పెడుతున్న ప్రపంచంలో చాలా మంది యువకులు క్రమపద్దతిలేని జీవన శైలిని గడుపుతున్నారు. 

ఉదాహరణకు ఎక్కువ గంటలు పనిచేయడం, ఎక్కువ సమయం స్టడీస్ లో నిమగ్నమవడం, ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం అంటే కంప్యూటర్ ముందు, సెల్ పోన్లలో గడపడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తీసుకునే ఆహారంపై శ్రధ్ధపెట్టకుండా.. ఆకలైనప్పుడు ఏదో ఒకటి అని జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు. 

ప్రాసెస్ చేయబడిన ఫుడ్ లో ఎక్కువ చక్కెరలు, బ్యాడ్ కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉంటుంది.  ఇది గుండె సంబంధ రోగాలను పెంచేందుకు ప్రధాన కారణమవుతాయి. 

ఊబకాయం...

గుండె సంబంధ సమస్యలకు రెండో ప్రధాన కారణం.. ఊబకాయం. ప్రస్తుతం యూత్ లో ఊబకాయం ( అధిక బరువు) సమస్య ఎక్కువగా ఉంది. అధిక బరువు బ్లడ్ ప్రెజర్ కు దారితీస్తుంది. టైప్ 2 డయాబెటిక్ , కొలెస్ట్రాల్ పెరిగేందుకుకారణం అవుతంది. వీటి వల్ల హృదయ నాళ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా గుండె జబ్బులకు దారి తీస్తుంది. దీంతోపాటు ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఫుడ్ లో గుండె ఆరోగ్యానికి తోడ్పడేందుకు అవసరమైన పోషకాలు ఉండటం లేదు. ఇది గుండె జబ్బులను తీవ్రతరం చేస్తుంది. 

యువతలో మానసిక సమస్యలు 

 ప్రస్తుతం తినే ఫుడ్, జీవనశైలి యువతలో మానసిక ఒత్తిళ్లను పెంచుతుంది.దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఒత్తిడి వలన కార్టిసాల్ అనే హార్మోన్లు విడుదలకు దారి తీస్తుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. దీంతో వాపింగ్, పొగతాగడం, మందుతాగడం వంటి అనారోగ్య కోపింగ్ మెకానిజం లకు కారణం అవుతుంది. ఈ అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసి తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ లకు దారి తీసే అవకాశం ఉంది. 

యువతలో జన్యు సంబంధ సమస్యలు 

యువత ఆరోగ్యంలో జన్యు పరమైన కారణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా గుండెపై ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబంలో ఎవరికైనా హైపర్ కొలెస్ట్రరోలేమియా వంటి సమస్యలు ఉంటే.. చిన్న వయసులో యువత అధికా కొలెస్ట్రరాల్ బారినపడే అవకాశం ఉంది. దీంతో గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. అటువంటి జన్యుపరమైన సమస్యలు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చే వరకు బయటపడవు.. ఇటువంటి పరిస్థితులను ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. 

రోటీన్ హెల్త్ స్క్రీనింగ్ లేకపోవడం.. 

యువతలో రెగ్యులర్ హెల్త్ చెకప్ లేకపోవడం కూడా గుండె జబ్బులకు కారణం అంటున్నారు డాక్టర్లు. వైద్యపరీక్షల విషయంలో నిర్లక్ష్యం తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారి తీసి ప్రాణాలమీదకు తెస్తుందంటున్నారు.రోటీన్ స్క్రీనింగ్ లు ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించడంలో సహాయపడుతుందంటున్నారు. 

యువతలో పెరుగుతున్న గుండె సమస్యలకు జీవనశైలి, మానసిక ఒత్తిడి, జన్యు సిద్ధత, ఆరోగ్య పర్యవేక్షణ లేకపోవడం వంటి ముఖ్యమైన కారణాలు..  చిన్న వయస్సు నుంచే గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే గుండె సంబంధిత సమస్యలను పరిష్కరించడం ద్వారా మరణాలను తగ్గించడంలో డాక్టర్లకు అవకాశం ఉంటుందని అంటున్నారు. సో బీకేర్ ఫుల్..అబౌట్ యువర్ హార్ట్