Krishna Ashtami Special 2024: కృష్ణాష్టమికి ఉట్టి ఎందుకు కొడతారో తెలుసా...

భారతీయులు అత్యంత సంబురంగా జరుపుకునే పండుగ కృష్ణాష్టమి. ఈ పండుగ స్పెషల్ ఉట్లు కొట్టడం. ఈ ఉట్టిని కొట్టడానికి యువతీ యువకులు పోటిపడి మరీ కొడతారు. రంగులను, పూలను చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను నిర్వహించడం పూర్వీకుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఉట్టి కొట్టిన వాళ్లకు గిఫ్ట్స్ కూడా ఇచ్చి ఆనందింపజేస్తారు. అయితే కృష్ణాష్టమి రోజు అసలు ఉట్టి ఎందుకు కొడతారో మనలో చాలా మందికి తెలియదు. దాని వెనుక ఉన్న రహస్యం ధర్మ సందేహంగా ఉంటుంది. అసలు ఉట్టి ఎందుకు కొడతారో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మసందేహంగా ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, పెరుగును దొంగతనం చేసేవాడు.

  ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు, పెరుగు ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్లు. అయితే కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోబెట్టి వాళ్లపైకి ఎక్కి ఉట్టిలోని పాలు, పెరుగును దొంగతనం చేసి తినేవాడు. ఆనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటిచెప్పేందుకు, ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు. అందుకనే శ్రీకృష్ణుడి చిలిపి చేష్టాలు గుర్తుకు వచ్చేలా.. కృష్ణుడి అల్లరిని ఈ తరం వారికి తెలియజేసేలా కృష్ణుని జన్మదినం రోజు ఉట్లు పగలగొట్టి సంతోషిస్తుంటారు. ఇది ఉట్ల పండుగ వెనుకున్న రహస్యం.

అయితే కాలం మారడంతో ఉట్టిలో పాలు, పెరుగు బదులు ఏవేవో వస్తువులతో పాటు రంగునీళ్లు, డబ్బులను వేస్తూ ఉట్టి కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తున్నారు. కృష్ణాష్టమి రోజు ఏర్పాటు చేసే ఉట్టిలో పాలు, పెరుగుతో పాటు పసుపు కొమ్ములను వేస్తే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఉట్టిలోని రహస్యం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. 

 కృష్ణాష్టమి వేడుకల్లో అత్యంత ప్రధానమైంది ఉట్టి కొట్టే సంబరం .ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు. ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు, పాలు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంబరం అందరిలోనూ ఆనందాన్ని నింపుతుందని పెద్దలు భావిస్తుంటారు.