Diwali 2024 : ఇంద్రుడికి సకల భోగాలు తిరిగి ఇచ్చింది లక్ష్మీదేవినే.. అందుకే దివాళీ రోజు పూజ చేసేది..

దీపావళి రోజున (అక్టోబర్​ 31) సాయంకాలం సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. సర్వలోకరక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని. శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరిసంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరినవారికి కొంగుబంగారమవుతుందని పురాణాలు చెబుతున్నారు.  .

దీపావళి సందర్భంగా లక్ష్మీపూజ చేయడానికి  వెనుక ఓ పురాణ కథ ఉంది. దుర్వాస మహర్షికి దేవేంద్రుడు ఆతిథ్యం ఇస్తాడు. దానికి సంతోషించిన దుర్వాసుడు ఇంద్రుడికి ఒక హారాన్ని బహుమతిగా ఇస్తాడు.  అప్పుడు  ఇంద్రుడు కృతఙ్ఞతలు చెప్నకుండా ...  దాన్ని తన దగ్గరున్న ఐరావతం ( ఏనుగు తొండం)  మెడలో వేస్తాడు. ఏనుగు తొండాన్ని అటు, ఇటు ఆడిస్తూ ఆ హారాన్ని  కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది. అసలే కోపిష్ఠి అయిన దుర్వాసుడు, ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై, ‘‘ఓ ఇంద్రా! మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నీవు.. ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి’’ అని శపించాడు.

మునులు.. మహర్షులు .. శాపం ఇస్తే ఎలాంటి వారైనా అనుభవించి తీరాల్సిందే.  అప్పుడు ఇంద్రుడు.. దుర్వాస మహామునిని క్షమించమని ప్రార్థిస్తాడు.  ఇంద్రుని మొరను ఆలకించిన దుర్వాసుడు కొంతకాలం శాపం అనుభవించక తప్పదని..  తరువాత విష్ణుమూర్తి కృపతో తిరిగి పూర్వవైభవం వస్తుందని చెబుతాడు.  

Also Read :- వెరైటీ స్వీట్స్.. అదిరిపోయే ప్యాకింగ్

ఇక ఇంద్రునిపై దుర్వాస మహాముని శాపం పని చేయడం మొదలవుతుంది.   బలి రాక్షసుని నేతృత్వంలో రాక్షసులు ఇంద్రుడి రాజ్యంపై దండెత్తుతారు.   ఇంద్రుడిని.. అతని  పరివారాన్ని స్వర్గలోకం నుంచి తరిమేస్తారు. ఇక చేసేదేమీ లేక కొంతకాలం పాటు ఇంద్రుడు అఙ్ఞాతంలో ఉండి.. బలి రాక్షసుడి నుంచి విముక్తి పొందేందుకు  తన గురువైన బృహస్పతిని ఆశ్రయిస్తాడు. 

అప్పుడు బృహస్పతి .. దివ్య దృష్టితో పరిశీలించి..  విష్ణుమూర్తి ప్రార్థించమని చెబుతాడు.  అప్పుడు ఆశ్వయుజమాసం అమావాస్య రోజు ప్రత్యక్షమైన విష్ణువు.. నీవు  సకల సంపదలకు అధిపతి అయిన  లక్ష్మీ దేవిని పూజించమని చెపుతాడు.  అలా పూజిస్తున్న సమయంలో  బలి రాక్షసుడి ( నరకాసురుడు)ని సాక్షాత్తు శ్రీహరి అవతారంలోని శ్రీ కృష్ణుని భార్య సత్యభామ హతమార్చిందనే వార్త తెలుస్తుంది.  దీంతో ఇంద్రునిని బలి రాక్షసుడు నుంచి విముక్తి కలగడం.. మళ్లీ పూర్వ వైభవం కలగడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.  

ఇంద్రుడు అలా చేయడంతో లక్ష్మీదేవి ఇంద్రుడికి మళ్లీ సకల భోగాలను తిరిగి వచ్చేలా చేస్తుంది. విజయాన్ని, ఐశ్వర్యాన్నికో రేవాళ్లు మహాలక్ష్మిని ఆ రోజు ( అక్టోబర్​ 31) ప్రదోష కాలంలో పూజిస్తే అవి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీదేవి చల్లనిచూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.