మీకు తెలుసా : చీతాలు పాములను తింటాయి.. మరి విషం ఎక్కదా...

సింహం ... చిరుత పులులు సాధారణంగా అడవిలో ఉంటాయి.  ఇవి జంతువులను వేటాడి తింటాయి.  సింహం ఎక్కువుగా  దుప్పి... జింక  వేడాడితే.. ఇక చిరుతలు మాత్రం  ప్రాణం ఉన్న  ఏ జంతువునైనా వేటాడుతుంది.  అందుకు సింహం.. పులులు తటస్థపడినప్పుడు ఏ జంతువైనా పరిగెడుతుంది.  అయితే పాములో  విషం ఉంటుందని అయినా సరే చిరుత మాత్రం పాము కనిపిస్తే వదలదు. అన్ని జంతువుల కంటే  చిరుత పులులు పాములనే బాగా ఇష్టంగా తింటాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.  

సాధారణంగా అడవిలో బలమైన జీవి బలహీనమైన వాటిని వేటాడి తింటుంది.  సాధారణంగా ఏ జీవికైనా.. సింహం.. పులులు ఎదురైతే   అవి పారిపోతాయి.  కాని పాములు మాత్రం కోరలు చాచి వాటితో పోరాడుతాయి.  సింహం మాత్రం పాముల జోలికి రాదు .. ఎందుకంటే సింహం పరిగెత్తించి వేటాడి చంపుతుంది.  పాములు పరిగెత్తలేవు.  

పాములకు.... పులులు ఎదురైతే అవి కోరలు చాచి పోరాడుతాయట.  కాని పులి పంజా దెబ్బకు పాములు మరణిస్తాయి.  అవి అప్పుడు వచ్చే వాసనను బట్టి దానిని తినాలా వద్దా నిర్ణయించుకుంటాయి.  కాని చంపడం మాత్రం ఖాయం.  సహజంగా పాముల్లో విషం ఉంటుంది.  కాని అడవుల్లో ఎక్కువుగా కొండచిలువ జాతికి చెందిన పాములు ఉంటాయి.  వాటిలో విషం ఉండదు.  పులి పంజాకు కొండ చిలువ దక్కిందా.. ఇక అంతే  ఆ రోజు ఆ రోజు పులికి విందు పార్టీనే.  లొట్టలేసుకుంటూ  మరీ ఆరగిస్తుందట. 

పాములకు ఉన్న సహజ లక్షణం అవి పరిగెత్తలేవు.  అంతే కాకుండా చాలా పొడవుగా ఉంటాయి.  పులి లాంటి వన్యమృగాలు ఎదురైనా సరే వాటిమీదనే పోరాడేందుకు సమాయత్తమవుతాయి.  దీంతో పులులు పంజా చాచి పాములను చంపి ఎంతో ఇష్టంగా విందారగిస్తుంది.