వినాయకుడు వరల్డ్ వైడ్ ఫేమస్ ఎందుకంటే.?

వినాయకుడు అన్ని గుళ్లలో ఉంటాడు. అందరికంటే ముందే పూజలు అందుకుంటాడు కాబట్టి, అందరికీ ప్రత్యేకమే. వినాయకుడు హిందూ మతం నమ్ముతున్న ఒక దేవుడు మాత్రమే కాదు. గ్లోబల్ గా పాపులర్ ఆయన, ముంబై, పూనే నుంచి హైదరాబాద్, చెన్నై వరకు దేశంలో ఏ నగరానికి వెళ్లి చూసినా వినాయకచవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. ఒక్క రోజో, రెండు రోజులో ఉండే పండుగ కాదు. పది రోజులు, దాదాపు అన్ని వీధుల్లో కొలువు తీరతాడు గణేశుడు. 

Also Read :- తిరుమల గుడ్ న్యూస్

దీంతో బయటిదేశాల వాళ్లు మనదేశంలో జరిగే ఉత్సవాల గురించి ఎప్పుడు మాట్లాడినా వినాయకుడి ప్రస్తావన ఉంటుంది. వినాయకుడ్ని దేశంలో ఒక పాపులర్ దేవుడిగా కొలుస్తారు. చిన్నపిల్లలకు, టీనేజ్ లో ఉన్నవాళ్లకు, పెద్దవాళ్లకు.. అందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు వినాయకుడు. అందుకే ఆయన గ్లోబల్, హిందూమతాన్ని దాటి వేర్వేరు రూపాల్లో, పేర్లతో బౌద్ధ, జైన మతాల్లో కూడా వినాయకుడు ఉన్నాడు.