మహిళల చేతులకు గాజులు అందమా.. ఆరోగ్యమా.. సైంటిఫిక్​ రీజన్​ ఏంటి?

 నేటి కాలంలో కేవలం ట్రెండ్‌ల కోసమే గాజులు ధరిస్తున్నారు. అయితే మహిళలు ఎందుకు బ్యాంగిల్స్ ధరిస్తారు..దీని వెనుక శాస్త్రీయమైన కారణం ఉందా...మహిళలకు సంబంధించిన వేడుకల్లో గాజులకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు..గాజులు ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణమేనా ..  శాస్త్రీయ కారణాలు ఉన్నాయా .. తెలుసుకుందాం...

బ్యాంగిల్స్ కేవలం అందానికి సంబంధించిన వస్తువు మాత్రమే కాదు . ఇది మన వారసత్వం,  సంస్కృతిలో కూడా భాగం. వీటిని ధరించడం ద్వారా మహిళలు అందంగా కనిపించడమే కాకుండా అపారమైన ప్రయోజనాలను పొందుతారు. చేతికి ధరించే గాజుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

వివాహానంతరం మహిళలు  గాజులు ధరించడానికి మతపరమైన కారణాలతో పాటు శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా అమ్మవారి పూజల్లో  గాజులు సమర్పిస్తారు.  వివాహ ప్రక్రియలో పండితులు చదివే మంత్రాల్లో  వధువు, వరుడులను సాక్షాత్తు.. పార్వతీ... పరమేశ్వరుడుగా..  లక్ష్మీ.. విష్ణుమూర్తిగా... సీతారామచంద్రులుగా భావిస్తూ మంత్రాలు చదువుతారు.  అంటే పెళ్లి అయిన ప్రతిస్త్రీ కూడా అమ్మవారితో సమానమని వేదాలు చెబుతున్నాయి.  అందుకే మహిళలు చేతులను అలంకరించుకొనేటప్పుడు గాజులకు పెద్దపీట వేస్తారు.

  • గాజులు సౌభాగ్యం యొక్క చిహ్నంగా పరిగణించబడతాయి. అమ్మవారు గాజులు ధరించి ఆశీర్వదించి భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేస్తుందని అంటారు. 
  •  ఆల్ ఇండియా రౌండ్ అప్ అండ్ సైన్స్ బిహైండ్ ఇండియన్ కల్చర్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం గాజులు ధరించడానికి అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మణికట్టుపై గాజులు ధరిస్తారు.  గాజుల  రాపిడి వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. దీనితో పాటు, ఆక్యుప్రెషర్‌లో ఉపయోగపడే మణికట్టులో చాలా ప్రెజర్ పాయింట్లు ఉంటాయి.చేతులకు గాజులు  వేసుకోవడంతో  అవి మధ్యలో నొక్కబడతాయి, దీని కారణంగా హార్మోన్ల సమతుల్యత నిర్వహించబడుతుంది. పురాతన కాలంలో పురుషులు కూడా తమ చేతులకు కంకణాలు ధరించడానికి ఇదే కారణం. 
  • గర్భిణీ స్త్రీలు రెండు చేతులకు బ్యాంగిల్స్ ధరించాలి.  గాజులు వేసుకోవడం ద్వారా కడుపులో పెరుగుతున్న తల్లి, బిడ్డ ఆందోళన చెందకుండా ఉంటారంట. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఒక స్త్రీ తల్లి కాబోతున్నప్పుడు, బేబీ షవర్(సీమంతం) వేడుకను నిర్వహిస్తారు. ఈ వ్రతంలో గర్భిణీ మహిళకు గాజులు సమర్పిస్తారు.దీనికి ప్రధాన కారణం కంకణాల శబ్ధం కడుపులోని బిడ్డకు ఊరటనిస్తుంది.  గాజుల శబ్దం తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా వినిపిస్తుందని నమ్ముతారు. ఏడవ నెలలో పిల్లల మెదడు కణాలు చురుకుగా మారడం ప్రారంభిస్తాయి . గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత సమస్య తొలగిపోతుంది. గాజుల శబ్దం.. తల్లి, కడుపులో ఉన్న బిడ్డకు ఒత్తిడి లేకుండా చేస్తుంది.
  • ముందుకు వెనక్కి గాజులు కదలటం వల్ల రక్త నాళాలకు మసాజ్ అవుతూ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  శరీరంలో శక్తి స్థాయులు పెరుగుతాయి. అలసట, ఒత్తిడి తగ్గటంతోపాటు నొప్పులను భరించే శక్తి లభిస్తుంది. శరీరంలో వేడిని తొలగించటంలో మట్టి గాజులు ఉపకరిస్తాయి.
  •  గ్లాస్ బ్యాంగిల్స్ ధరించాలని చెబుతారు. శబ్దం మహిళల నుండి ప్రతికూల శక్తిని దూరంగా గాస్ల్‌ బ్యాంగిల్స్‌ వాతావరణం నుండి మంచితనం, స్వచ్ఛతను గ్రహిస్తాయి. ఇది ధరించేవారికి  శక్తిని ఇస్తుంది. చుట్టుపక్కల వారి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
  • గ్లాస్ బ్యాంగిల్స్ రంగులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అవి ఎరుపు, ఆకుపచ్చ. కర్నాటక, మహారాష్ట్ర వంటి దక్షిణ భారత రాష్ట్రాలలో ఆకుపచ్చని గాజులను సాధారణంగా ధరిస్తారు. పంజాబ్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో రెడ్ కలర్ ఎక్కువగా వాడుతున్నారు. 
  •  గాజు బ్యాంగిల్స్‌లో గోల్డ్ వర్క్ కూడా జరుగుతుంది. ప్రశాంత స్వభావానికి ఆకుపచ్చ రంగు ఆధ్యాత్మికత, శాంతిని , ....చెడు శక్తిని తొలగించేందుకు ఎరుపు రంగు సూచిస్తాయి.చెడును నాశనం చేసే శక్తి ఎరుపు రంగుకు ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, గ్లాస్ బ్యాంగిల్స్ ధరించే మహిళలు ఎక్కువ భావోద్వేగానికి గురవుతారు. వారు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు
  • కొంతమంది బంగారం, వెండి గాజులు ధరిస్తారు. వీటి వల్ల  ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా కొందరు అంటుంటారు. బంగారం మరియు వెండి వంటి పదార్ధాలు చర్మాన్ని తాకడంపై వాటి ప్రభావాన్ని చూపి... అవి శరీరానికి శక్తిని అందిస్తాయి
  • ALSO READ | Health Tips: మీకు తెలుసా.. నీళ్లు తాగితే చర్మానికే కాదు.. పళ్లకి ఎంతో మేలు