దేవుడి పూజలో పూలు ఎందుకు వాడాలో తెలుసా ?

దేవుడి పూజలకు సాధారణంగా పూలను ఉపయోగిస్తారు.  భగవంతుడిని పూలతో పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం .  అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి ? దేవుళ్లకు పూలంటే ఎందుకంత ప్రత్యేకం ? దేవుడికి పూలు సమర్పించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి ?

పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు మార్గాన్ని సుగం చేస్తాయి. పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ దాగి ఉంటుంది, మరియు వాటి సువాసన పూజలో ఒకరకమైన సానుకూల దృక్పధాలను కలిగేలా చూస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరి, ఏకాగ్రత పెరగడానికి కారణమవుతుంది. ద్యానం, మంత్రోచ్చాణలు తోడైతే పూజా ఫలం మరింత ఎక్కువగా ఉంటుంది. 

పూలు వాడే విధానం పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి. వాడిపోయినవి, ముళ్లుతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు ఉపయోగించరాదు. మహాలక్షికి ఎనలేని ప్రీతి. అలాగే తెల్లని పూలంటే.. చదువుల తల్లి సరస్వతికి, పసుపు రంగు పూలు పార్వతీదేవికి ఇష్టం. కాబట్టి ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగించడం శ్రేయస్కరం.

 దేవునికి పూలను సమర్పించడానికి సరైన మార్గాలను గురించి కూడా తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి పూలే , తర్వాతే ఏమైనా అనే విషయం అందరికి తెలిసిన నిజమే కదా అని  ఎటువంటి ఆలోచనా లేకుండా చెప్పవచ్చు. గడ్డి పువ్వులో కూడా అందం దాగి ఉంటుందని. శ్రేయస్కరమైన పూలు తామర, కలువ, జాజి, చామంతి, నందివర్దనం, మందారం, నీలాంబరాలు, కనకాంబరాలు, పారిజాతం, పద్మాలు, ఎర్రగన్నేరు, నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం.

పూలను దేవునికి  సమర్పించడం ద్వారా, ఈ ప్రకృతిలోనే అందమైన విషయాన్ని దేవునికి సమర్పించిన భావన కలుగుతుంది. పూలను సమర్పించే విధానం అనుసరించి, భక్తుడు ఎంత భక్తి ప్రపత్తులను, నియమ నిష్ఠలని కలిగి ఉన్నాడో అన్నది తెలుస్తుంది. దేవునికి పూలను సమర్పించడం ద్వారా అనేక లాభాలను పొందవచ్చు . నియమ నిష్టలతో దేవునికి ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎన్నడూ ఉంటుంది, తద్వారా ఆర్ధిక సమస్యలు లేకుండా, మానసికంగా, శారీరకంగా , స్నేహితుల మరియు కుటుంబ సంబంధాల పరంగా సమస్యలను దూరం చేసి , క్రమంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆశీర్వదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

పూజ అనే పదంలో కూడా పూల గురించిన ప్రస్తావన ఉంది .  పూజ అనే పదంలో మొదటి అక్షరం పుష్పాన్ని సూచిస్తే, రెండవ అక్షరం జపాన్ని సూచిస్తుంది. అనగా పుష్ప జపం అని అర్ధం వచ్చేలా. జపం అనగా ఇష్ట దేవుని ఇతర పేర్లతో స్మరించడం.  జ  అనే అక్షరం జలాన్ని కూడా సూచిస్తుంది. 

మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం పూలను మాలధారణ, లేదా ప్రతిమకు కాని విగ్రహానికి కాని పూలను అలంకరించడమే కాకుండా మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం ద్వారా కూడా దేవుని కృపకు పాత్రులు కాగలరని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.