రైతన్నల ఆదాయం పెరగాలంటే.. ఏం చేయాలో తెలుసా...

ప్రస్తుతం  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం చాలా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన వనరులు ఉపయోగించుకుంటే .... అంటే వివిధ పంటల ఉత్పాదకత పెరుగుదల, పంట విస్తీర్ణం పెంచడం...  అధిక విలువ గల పంటలను విస్తరించడం వలన రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు.

గ్రామస్థాయిలో రైతులు వేరువేరు వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల సాగుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా (పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలు, తేనె టీగలు, పట్టుపురుగులు) ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. నేల రకం, నీటిలభ్యతను బట్టి  అక్కడ వ్యవసాయ పరిస్థితులు ఉంటాయి. అక్కడున్న పరిస్థితులను  బట్టి పంటల సరళి, పంటల యాజమాన్య పద్ధతులు మారతాయి.

 ప్రస్తుతం ఎక్కువ మంది   వ్యవసాయం చేయడం... . పంట వేసే ముందు చేయాల్సిన పనులు చేయలేకపోవడం వలన (పంటల అవశేషాల యాజమాన్యం, వేసవి లోతు దుక్కులు, భూసార పరీక్షలు, పశువుల ఎరువు తోలడం పచ్చిరొట్ట పైర్ల సాగు లాంటివి) భూసారం తగ్గటం, కలుపు చీడపీడల సమస్యలు అధికం అవ్వడం వలన సాగు ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. వ్యవసాయేతర అవసరాల కోసం భూమిని వాడడం వలన భూసాగులో మరింత విస్తీర్ణం సాధ్యపడదు. దీనివలన  వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర అవసరాలకు మళ్ళించడంతో పది లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి తగ్గింది. అందువలన వ్యవసాయంలో ఉన్న భూమితో ఉత్పత్తిని పెంచడానికి యూనిట్‌ ఉత్పత్తికి ఉత్పాదకతలో మెరుగుదల రావాలి. పంట  ఉత్పత్తిని పెంపొందించే అత్యంత శక్తివంతమైన నీటిపారుదల .. సాంకేతికతను మెరుగుపరిస్తే పంట ఉత్పత్తి పెరుగుతుంది. 

భారతదేశం ప్రధాన పంటలను ఖరీఫ్‌ ... రబీ కాలంలో రైతులు అదే భూమిలో సంవత్సరానికి రెండు పంటలను పండించవచ్చు. . అందుబాటులో ఉన్న వ్యవసాయ భూమిని అన్ని కాలాలలో సక్రమంగా వినియోగించుకుంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.అధిక విలువలను ఇచ్చే పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయడం వలన రైతుల ఆదాయాన్ని మెరుగుపరచేందుకు గొప్ప అవకాశం ఉంది.

కూరగాయలు, పండ్లు, నీరా పంటలు, పూలు, మసాలా దినుసులు, పప్పులు, చెరకు మరియు పత్తి పంటలను సాగు చేయడం వలన ఆదాయాన్ని రెట్టింపు అవుతుంది.  ఎక్కువ మంది రైతులు నిరుద్యోగం వలన వ్యవసాయంలో పాల్గొంటున్నారని వ్యవసాయం మరియు వ్యవసాయేతర రంగాలకు మధ్య కార్మికుల ఉత్పాదకతలో పెద్ద వ్యత్యాసాన్ని కూడా వెల్లడిస్తుంది. దీని కారణం రైతులకు, వ్యవసాయ అనుబంధ వ్యాపార రంగాలలో అవగాహన లేకపోవడం వ్యవసాయ అనుబంధ వ్యాపార రంగాలలో రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ వలన కూడా రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

రైతుల ఆదాయాన్ని పెంచుకోనడానికి కొన్ని సూచనలు 

  • వ్యవసాయ  భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి (జన్యుపరంగా వివిధ పంటల విత్తనాల అభివృద్ధి, అధిక దిగుబడినిచ్చి, చీడపీడలను తట్టుకొని మార్కెట్లో ఎక్కువ ధర వచ్చే రకాలను రూపొందించుట ఎగుమతికి అనుకూలమైన రకాలైన అభివృద్ధి చేయాలి)
  •  సాగు విస్తీర్ణం పెంచలేము కాబట్టి ... సాగు విస్తీర్ణంలో అధిక దిగుడులను ఇచ్చే రకాలను జన్యుపరంగా అభివృద్ధి చేయాలి.
  • రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను సరైన సమయాల్లో సరైన ధరలకు అందించి వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకునేటట్లు చూడాలి.
  •  వ్యవసాయంలో విలువైన ఆధారిత ఉత్పత్తులను పెంచుకోవాలి.
  •  రైతులకు గిట్టుబాటు ధర రావడానికి మార్కెట్లో సంస్కరణలు తీసుకుని రావడం...  గ్రామస్థాయిలో వ్యవసాయ పంటలకు నిలువ గోదాములు ఏర్పాటు చేయడం.. మార్కెట్‌ వ్యవస్థలను పటిష్టం చేయడం....
  •  నియంత్రిత పంటల సాగు చేపట్టడం వలన రైతుల ఆదాయం పెంచుకోవాలి...
  •  రైతులు పంటభీమాను తప్పకుండా చేసుకోవాలి...రైతులు పంటల భీమా చేయడానికి సులభతరం చేయాలి.
  • వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి...
  •  భూసార పరీక్షల కార్డుల పంపిణీ భూసార ఆధారిత ఎరువుల వాడకం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలి.
  • నాణ్యమైన మూల విత్తనాలను రైతులకు అందించి, గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా నాణ్యమైన విత్తన లభ్యత పెంచడం సొంత విత్తనం వాడుకోవడం వలన ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.
  •  సమగ్ర పంటల యాజమాన్యం చేపట్టడం (సమగ్ర రక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచాలి).
  • సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం సేంద్రియ ఉత్పత్తుల రిజిస్ట్రేషన్‌ సులభతరం చేసి సేంద్రియ ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి.
  •  సమస్యాత్మక భూములను బాగు చేసి పంటలు ఉత్పాదకతను పెంచుకోవాలి.
  • సహజవనరులను అభివృద్ధి చేయడం, కరువు పరిస్థితులను అధిగమించడానికి నీటి నిల్వకు నీటి కుంటలు మరియు సూక్ష్మసేద్యం, బిందు సేద్యం చేపట్టడం.
  •  వాతావరణ ఆధారిత పంటల సరళి ...రూపకల్పన ... కరువు వచ్చే సమయంలో  ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించాలి.
  •  అంతర పంటలను (వేరుశనగ ...లో...  కంది) (కంది ..లో...కొర్ర )వివిధ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వేసుకొని రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలి.
  •  మిశ్రమ వ్యవసాయం (వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాలు) చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
  •  వ్యవసాయ వ్యాపార రంగాలైన పుట్టగొడుగులు, తేనెటీగలు, అజోల్లా, జీవన ఎరువులు, వర్మీ కంపోస్ట్‌, వేప ఆధారిత ఉత్పత్తులు మరియు చిరుధాన్యాల ఉత్పత్తుల ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
  •  వృక్షజాతి మొక్కలైన టేకు, వేప, గంధం, ఎర్రచందనం, వెదురు సంబంధిత మొక్కల పెంపకం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.
  •  రైతు ఉత్పత్తిదారుల సంఘాలను, ఇతర రైతు సంఘాలను బలపరిచి వారి ద్వారా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసి రైతులలో సేంద్రియ వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి.
  • వాణిజ్య పంటలైన చెరకు, తమలపాకు, కూరగాయల సాగు మరియు సుగంధ ద్రవ్య పంటలైన పసుపు, అల్లం, ధనియాలు, వెల్లుల్లి, వాము మరియు సోంపు లాంటివి సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సహజ రంగు తీత పంటలైన జాఫ్రాను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలి.
  • రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా విస్తరణ కార్యక్రమాలను విస్తృత పరచడం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయనికి సంబంధించిన ఇతర అధికారులు సరైన శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి రైతులలో ఉత్సాహాన్ని కలుగజేసి రైతుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి రైతుల అభివృద్ధికి తోడ్పడేలా చేయాలి.
  •  ప్రస్తుతం తరుగుతున్న భూగర్భ జలాలు, పంటల అవశేషాలను కాల్చడం, సేంద్రీయ కర్భనం తగ్గడం, అసమతుల్యత పోషకాల వినియోగం, కార్మికుల కొరత, వేతనాల పెరుగుదల, ఇంధన ధరల పెరుగుదల, సహజ వనరులు నేల, నీరు, గాలి కలుషితం మరియు అధిక వినియోగం అనేది వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం చూపుతాయి.
  •  వాతావరణ ఆధారిత మెరుగైన సాంకేతి పరిజ్ఞానాన్ని రూపొందించడం మరియు వ్యాప్తి చేయడం చురుగ్గా చేయాలి.
  • ఆధునిక సాధనాలు, మౌళిక సదుపాయాలు మరియు నైపుణ్యాలు పెంచుకొని రైతుల ఆదాయాన్ని పెంచడంలో దోహదపడాలి.
  •  వ్యవసాయ రుణ వ్యవస్థను బలోపేతం చేయడం.
  • బహుళ సంస్థాగత పరిశోధనా, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు అభివృద్ధి చేయడం తగిన పరిశోధన మౌలిక సదుపాయాలు ఏర్పరచుకొని రైతుల అభివృద్ధికి వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.