పాలు కాచేటప్పుడు మనం జాగ్రత్త వహించాలి, అవి పొంగిపోకుండా చూడాలి. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా పొంగిపోవడం సాధారణమైన విషయమే. అయితే అసలు పాలు ఎందుకు పొంగుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? Quoraలోనూ ఓ యూజర్ ఇదే ప్రశ్న అడిగారు. ఇది చాలా మందికి ఆసక్తిని కలిగించింది. Quora సభ్యుని ప్రకారం, ఒక వివరణ ఏమిటంటే, పాలలో కొవ్వు, ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో 87 శాతం నీరు, 5 శాతం ప్రొటీన్లు, 5 శాతం లాక్టోస్ లేదా మిల్క్ షుగర్ ఉంటాయి. ఇవి పాలను తీపిగా మార్చడానికి కీలక పాత్ర పోషిస్తుంది. 7 శాతం కొవ్వు మాత్రం అది నీటి కంటే తేలికైనందున పైన తేలుతుంది. తద్వారా పైభాగంలో క్రీము పొరను ఏర్పరుస్తుంది.
పాలు నిరంతరం వేడి చేయడం వల్ల, అందులోని నీటి కంటెంట్ 100 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని వేడెక్కడం ప్రారంభమవుతుంది. చిన్నగా మొదలైన బుడగలు విస్తరించి పైభాగంలోని కొవ్వు, క్రీము పొరను పైకి లేపుతుంది. దీని వలన అది పొంగుతుంది. నీరు మరిగే సమయంలో, ఆవిరి బుడగలు ఉపరితలంపైకి చేరిన వెంటనే విరిగిపోతాయి, అందువల్ల నీరు పొంగిపోదు.
పాలు వేడి చేసేటప్పుడు పొంగకుండా ఉండాలంటే ఓ సులభమైన పరిష్కారం ఉంది. పాలను ఎల్లప్పుడూ తక్కువ మంటపై వేడి చేసేలా చూసుకోండి. పాలు పొంగిపొర్లకుండా నిరోధించడానికి ఇది సహాయం చేస్తుంది. లేదంటో పాల గిన్నెలో పొడవాటి హ్యాండిల్ చెంచా ఉంచాలని నిర్ధారించుకోండి. ఇది చెంచా హ్యాండిల్‌తో పాటు నీటి ఆవిరిని తప్పించుకోవడానికి అనుమతిస్తుంది.
పాలు కాకుండా, నీటిలో సూప్, చాక్లెట్ సాస్ లేదా పాస్తా వంటి ఘన కణాలను కలిగి ఉన్న ఏదైనా సరే అది పొంగిపొర్లుతుంది. సముద్రపు నీరు కూడా వేడి చేసేటప్పుడు, పొంగిపొర్లుతుంది. అయితే ఒక Quora యూజర్.. ఫిజీ డ్రింక్స్ పోసినప్పుడు కూడా నురగలు వస్తాయని సూచించారు. అతని ప్రకారం., చక్కెర, పండ్ల రసాలు లేదా ఆహార రంగు వంటి కణాలను కలిగి ఉన్న కార్బోనేటేడ్ పానీయాలు కరిగిన వాయువు విడుదలను ప్రేరేపిస్తాయి కావున నురుగు రావచ్చు.