ఎంత మందికి తెలుసు : ధనత్రయోదశి ఎలా జరుపుకోవాలి.. మధ్య తరగతి కుటుంబాల్లో

హిందూ క్యాలెండర్ ప్రకారం,  దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజున ధనత్రయోదశి( దంతేరాస్) పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి (దంతేరాస్) నవంబర్ 10 శుక్రవారంన జరుపుకోవాలి. ధన త్రయోదశి లేదా ధంతేరస్ పండుగ ప్రత్యేక ప్రాముఖ్యత గ్రంధాలలో చెప్పబడింది. పంచాంగం ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున ధన్వంతరి దేవ్, లక్ష్మీ జీ , కుబేర్ దేవ్‌లను పూజిస్తారు. అలాగే, ఈ రోజున బంగారం, వెండి,  పాత్రలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ ఏడాది నవంబర్ 10న ధంతేరస్ పండుగను జరుపుకోనున్నారు. ధన త్రయోదశి శుభ సమయం, పూజా విధానం , ప్రాముఖ్యతను తెలుసుకుందాం...

పంచాంగం ప్రకారం,  త్రయోదశి తిథి నవంబర్ 10,శుక్రవారం మధ్యాహ్నం  12:35  గంటలకు ప్రారంభమై  నవంబర్ 11శనివానం మధ్యాహ్నం  01:57  గంటలకు ముగుస్తుంది. పండితులు చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది  ధనత్రయోదశి ( దంతేరాస్) పండుగను నవంబర్ 10న జరుపుకుంటారు.

ధన త్రయోదశి శుభ సమయం

జ్యోతిషశాస్త్ర పంచాంగం ప్రకారం, నవంబర్ 10 వ తేదీ సాయంత్రం 05:27 నుండి 07.27  వరకు ధన త్రయోదశి పూజకు అనుకూలమైన సమయం ఉంటుంది. ప్రదోష కాల సమయం  నవంబర్ 10 సాయంత్రం 5.09 నుండి రాత్రి7.42 వరకు ఉంటుంది. 

పూజా విధానం

ఈ రోజు (నవంబర్ 10)  తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకోండి. ధన త్రయోదశిలో ధన్వంతరి , కుబేరు దేవ్‌లను పూజించాలని శాస్త్రంలో ఉంది. సాయంత్రం శుభ ముహూర్తంలో మాత్రమే పూజలు చేయాలి. ఈ రోజున ఇత్తడి, వెండి పాత్రలు కొనడం ఆనవాయితీ. అందుకని కచ్చితంగా మార్కెట్ నుంచి ఏదైనా కొని తెచ్చుకోండి. ఈ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం , ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి. ఎందుకంటే దీపావళి పండుగ ధంతేరస్ నుండే ప్రారంభమవుతుంది. ధనత్రయోదశి రోజున, సాయంత్రం శుభ సమయంలో ఉత్తరం వైపు కుబేరుడు , ధన్వంతరిని స్థాపించండి. అలాగే, తిలకం తర్వాత, అతనికి పుష్పాలు, పండ్లు మొదలైనవి సమర్పించండి. అదే సమయంలో 'ఓం హ్రీం కుబేరాయై నమః' అనే మంత్రాన్ని జపించండి. ధన్వంతరిని ప్రసన్నం చేసుకోవడానికి, ఈ రోజున ధన్వంతరి స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల సుఖం, ఐశ్వర్యం లభిస్తాయి.

ప్రాముఖ్యతను తెలుసుకోండి

పురాణాల ప్రకారం, దేవతలు , రాక్షసులు సముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు, ధన్వంతరి ఈ రోజున చేతిలో అమృతం , కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ రోజున ఆయనకు పూజలు చేస్తారు. ధన్తేరస్ రోజున సంపదకు దేవుడు అయిన కుబేరుని పూజిస్తారు. ఈ రోజున ధన్వంతరి , కుబేరుడు దేవతలను పూజించే వ్యక్తి అని నమ్ముతారు. అతను సంపద, కీర్తి , ప్రతిష్టలను పొందుతారు. 

సముద్ర మథనం సమయంలో, ఆశ్వయుజ  కృష్ణ త్రయోదశి రోజున, ధన్వంతరి భగవానుడు  అమృతం పాత్రతో  ప్రత్యక్షమయ్యాడని విష్ణుపురాణంలో పేర్కొన్నారు. ధన్వంతరి విష్ణువు యొక్క 21 అవతారాల్లో ఒక అవతారమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  ప్రపంచంలో ఆయుర్వేద వైద్య విజ్ఞానాన్ని విస్తిరింపచేసేందుకు  శ్రీమహావిష్ణువు ధన్వంతరి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి.   విష్ణుమూర్తి అంశే ధన్వంతరి అని చెుప్పేందుకు గుర్తుగా దన్తేరాస్ పండుగను జరుపుకుంటారు.

శుక్రాచార్యుని కన్ను పీకేసిన విష్ణుమూర్తి ... బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన విష్ణుమూర్తి

ధన్‌తేరస్‌కు సంబంధించిన మరొక కథ ఏమిటంటే, ఆశ్వయు. కృష్ణ త్రయోదశి రోజున, దేవతల పనిని అడ్డుకున్నందుకు  విష్ణుమూర్తి  రాక్షసుల గురువు శుక్రాచార్యునికి ఒక కన్ను పోయేలా చేశాడు. పురాణాల ప్రకారం  మహావిష్ణువు 10 అవతారాల్లో ఐదవ అవతారం  వామన అవతారం .. ఈ వామనుడు అతిథి గర్భాన జన్మించిన వ్యక్తి. మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు.. వైరోచకుని కుమారుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు. బలి చక్రవర్తి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు.  ఆసమయంలో  మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా జన్మించిన విష్ణుమూర్తి .. బలి చక్రవర్తిని అణచివేసే సమయం కోసం ఎదురు చూడ సాగాడు. అయితే ఒకసారి బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తోంది.

బలిచక్రవర్తిని అంతమొందించేందుకు  ఇదే సరైన సమయంగా  భావించిన విష్ణుమూర్తి చిన్నారి బ్రాహ్మణుడి వామనుడి రూపంలో యాగశాల వద్దకు వెళ్తాడు. దీంతో బలిచక్రవర్తి ఆ వామనుడికి సాదర స్వాగతం పలికి నీకు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. తమకు యాగం చేసుకోవడానికి మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. దీంతో బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం అడుగుతున్నవ్యక్తి  వామన రూపంలో ఉన్నటువంటి రాక్షస విరోధి అయిన మహా విష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కనిపెడతాడు. ఇదే విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు. కానీ అప్పటికే ఆయన మాట ఇచ్చేశానని, ధనం ... ప్రాణం మీద వ్యామోహంతో మాట వెనక్కి తీసుకోలేనని అంటాడు. దీంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని శపించి వెళ్లి పోతాడు. దీని తర్వాత బలిచక్రవర్తి పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకొని, వామనుడు కోరిన కోరిక మేరకు మూడు అడుగుల దానం ఇస్తున్నానని ప్రకటిస్తూ కలశం తో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లను పోసుకుంటాడు.

ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశంలోకి ప్రవేశించి  నీరు వచ్చే రంధ్రానికి అడ్డుగా ఒక కన్ను ఉంచుతాడు.  ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భపుల్లతో రంధ్రాన్ని పొడవగా తనకున్న రెండు కళ్ళలో ఒక కన్ను కోల్పోతాడు. అలా దాన్ని కోరిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ లోకమంతా ఆక్రమించేస్తాడు.. ఒక అడుగు భూమి మీద మరొక అడుగు ఆకాశం మీద వేస్తాడు.. ఇక మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. దీంతో బలిచక్రవర్తి నా తలపై వేయి అంటూ తల వంచుతాడు . దీంతో వామనుడు తన మూడవ అడుగును బలి నెత్తి పైన వేసి అదః పాతాళానికి తొక్కేస్తాడు. 

ఉత్తరాది పండుగ

ధనత్రయోదశిని  (దంతేరాస్ ) దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకుంటారు. రాను రాను దక్షిణాదివారూ ఫాలో అవుతున్నారు. బంగారం-వెండి కొనుగోలు చేయడం, లక్ష్మీపూజ చేయడం మంచిదే కదా ఇందులో తప్పేముందని భావిస్తున్నారు. అందుకే తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు కొత్తవి కొనుగోలు చేసి పూజించడాన్ని  శుభప్రదంగా భావిస్తారు. సాధారణంగా ఈ పూజను ప్రదోష వేళలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాల కాలాన్నే ప్రదోషకాలం అంటారు..