శ్రావణ మంగళవారం నోము ఎందుకు చేయాలో తెలుసా...

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం.... వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపుబొట్టు వాయనములు ఇవ్వాలి. 

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. 

శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ. పండు, తాంబూలంతో వాయనాలిస్తారు.. అయితే ఈ వ్రతాన్ని ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేస్తారు.  కుదిరితే అందరి ముత్తైదువలను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు.. లేదంటే వారి ఇంటికే వెళ్లి వాయినాలు ఇస్తూ ఉంటారు.

ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపుబొట్టు  వాయనములు ఇవ్వచును.

ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. పూజకు ఎర్రని పూలు, పచ్చని పూలు, ( గులాబిలు, చామంతి) గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితం, కుటుంబ జీవితం బాగుంటుంది. తప్పకుండా ఆ రోజు తులసి అమ్మవారిని .. గోమాత పూజకూడా చేసి గోమాతకు  మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి.
 
మంగళగౌరీవ్రతమును ఆచరించే అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘసుమంగళిగా వర్ధిల్లిందని పురాణాలు చెబుతు న్నాయి. అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీమాతను దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేకూరుతుందని విశ్వాసం

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
 శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే