పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించటం అనేది కామన్.. చిన్న పోరగాడు నుంచి అందరికీ తెలిసిందే.. ఇటీవల కాలంలో చాలా మంది.. పెట్రోల్ కొట్టించే సమయంలో.. 100, 200, 300, 500 రూపాయలు అని కాకుండా.. 115, 212, 324 రూపాయలు ఇలా కొట్టిస్తున్నారు.. అదేంటీ.. ఇలాంటి అంకెలతో పెట్రోల్ కొట్టిస్తున్నారు అని ప్రశ్నిస్తే.. 99 శాతం మంది చెప్పింది ఏంటో తెలుసా.. ఇలా కొట్టిస్తే పెట్రోల్ ఎక్కువ వస్తుంది.. ట్యాంపరింగ్ జరగదు అనే సమాధానం వస్తుంది.. వంద, 200, 300 ఇలాంటి డీజిల్ రూపాయలతో కొట్టిస్తే.. ట్యాంపరింగ్ ఉంటుందని.. చిల్లర రూపాయలను కలిపి కట్టిస్తే ట్యాంపరింగ్ జరగదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. వాస్తవానికి నిజంగా ఇలా జరుగుతుందా.. పెట్రోల్ బంకుల్లో ఇలాంటి డిజిట్ నెంబర్లకు ట్యాంపరింగ్ ఉంటుందా అనే దానికి.. ప్రముఖ .. వ్యక్తి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది..
వాహనదారులు ఈ మధ్య కాలంలో పెట్రోల్.... డీజిల్ ను గతంలో లీటర్ల రూపంలో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు కూడా లీటర్లలో పెట్రోల్ పోస్తున్నా... కొంతకాలం వరకు 100 రూపాయిలకు , 200 రూపాయిలకు , 300 రూపాయిలకు, 500 రూపాయిలకు కొనుగోలు చేశారు. కాని ఇప్పుడు వాహనదారులు మాత్రం 115 రూపాయిలకు, 212 రూపాయిలకు, 324రూపాయిలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా కొనుగోలు చేయడం వల్ల మోసం... ట్యాంపరింగ్.. కొలత పరిణామం సరిగ్గా ఉంటుందని జనాలు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై రైల్వే మాజీ ఇంజనీర్ అనిమేష్ కుమార్ సిన్హా స్పందించారు.
పెట్రోల్ బంక్లో ఇంధనం విక్రయించేటప్పుడు... పెట్రోల్ నింపే మిషన్ లలో టెక్నాలజీ కొన్ని కోడ్లతో పెట్రోల్ వచ్చే విధంగా అమర్చుతారు. 100 రూపాయిల పెట్రోల్ అడిగితే దానికి ఒక కోడ్ ను అమర్చుతారు. ఇలా ఒక్కో రేటుకు ఒక్కో కోడ్ను అమర్చుతారని అనిమేష్ కుమార్ సిన్హా తెలిపారు.
పెట్రోల్ పంప్ మిషన్ లో ఫ్లో మీటర్ఉంటుంది. ఇందులో సాంకేతికను ఉపయోగించి .... రూపాయిల్లో సాఫ్ట్వేర్ను సెట్ చేస్తారు. దీని ప్రకారం పెట్రోల్ రేటును నిర్ణయిస్తారని అనిమేష్ కుమార్ సిన్హా అన్నారు. ఉదాహరణకు 1.24 లీటర్ల పెట్రోల్ రేటు 136 రూపాయిలైతే అయితే 150 రూపాయిలు పెట్రోల్ కొనుగోలు చేయానుకుంటే మీటర్ ఇంకా ఎక్కువ రావాలి. కాని మీటర్ ను అలాసెట్ చేయరని సిన్హా అంటున్నారు. 115 రూపాయిలు, 212 రూపాయిలు , 324 రూపాయిలు పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు మోసం ఎక్కువుగా జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.