కారణాలు ఏంటీ అంటే : విమానాల్లో తీసుకెళ్లటానికి కొబ్బరి, టెంకాయలు నిషేధం

ఫ్లైట్ జర్నీలో బ్యాగేజీని తీసుకెళ్లే విషయంలో విమానయాన సంస్థలు కొన్ని కండిషన్స్ విదిస్తాయి. మనం విమానం ఎక్కేటప్పుడు మనతో తీసుకెళ్లడానికి అనుమతి లేని వస్తువులు చాలా ఉన్నాయి... అవేంటీ అంటే, పదునైన ఆయుధాలు, తుపాకీలు మరియు మండే వస్తువులతో సహా అనేక వస్తువులను విమానంలో తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

అంతే కాకుండా, మనం నిత్యం పూజ కోసం, వంట కోసం వాడే కొబ్బరి, టెంకాయలు కూడా విమానాల్లో తీసుకెళ్లడం నిషేధం. అందుకు సరైన కారణం కూడా ఉంది. కొబ్బరిలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల ఫ్లైట్ లో అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంది కాబట్టి వీటిని నిషేధం విధించారు.

దుబాయ్ విమాన ప్రయాణానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇటీవలే మారాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రింటెడ్ మెటీరియల్, ఆర్ట్ వర్క్ వంటి వాటితో పాటు నాన్ వెజ్ వంటి ఫుడ్ ఐటమ్స్, నకిలీ కరెన్సీ పై కూడా నిషేధం విధించారు.కాబట్టి నిషేధిత వస్తువులను ఫ్లైట్ లో తీసుకెళ్లి ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త వహిస్తే మంచిది.