కలియుగంలో మనుష్యులను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా భగవంతుడు అవతరించిన అవతారాల్లో హరిహరసుతుడు అయ్యప్పస్వామి అవతారం ఒకటి. . ఆయననకు అయితే అయ్యప్పను హరిహరసుతుడని ఎందుకు అంటారు.. అయ్యప్పస్వామికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం
శబరిమలలో కొలువైవున్న అయ్యప్ప స్వామి క్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. కేరళ పశ్చిమ కొండ పర్వతప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. అయితే అయ్యప్పను హరిహరసుతుడని అంటారు. అయ్య ( విష్ణువు), అప్ప ( శివుడు) అని పేర్ల సంగమం తో అయ్యప్ప నామం పుట్టింది.
మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. ఆ తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు అయ్యప్ప జన్మించాడు. అందుకని అయ్యప్పను హరిహరపుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు. దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరన్ లేదా శివుడి కొడుకు అని అర్థం.
అలాగే అయ్యప్పను మణికంఠ అని ఎందుకంటారు అంటే ఆయన జీవితచరిత్ర ప్రకారం, ఆయన తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ(కందన్) చుట్టూ ఒక బంగారు గంట (మణి) కట్టారంట. అందుకే అయ్యప్పను మణికంఠ అని పిలిస్తారు. కలియుగంలో ధర్మాన్ని స్థాపించేందు స్వామి అవతరించాడని అందుకే ధర్మశాస్త అని కూడా పిలుస్తారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.