Health Alert : పెద్ద ప్రేగు లేదా పురీషనాళంలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్ ను పెద్ద ప్రేగు క్యాన్సర్ అని అంటారు. దీనిని కొలొరెక్టల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. జీర్ణవ్యవస్థ లో పెద్దప్రేగు , పురీషనాళం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, వ్యర్థాలను వదిలించడం వంటి చర్యలు చేపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 10 శాతం ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఇది రెండో సాధరణ కారణమట.
సాధారణంగా పాలిప్స్ అని పిలువబడే అసాధారణ పెరుగుదల నుంచి ఈ క్యాన్సర్ అభివృద్ది చెందుతుంది. ఇది మొదట్లో ఎలాంటి అపాయం లేనిది కనిపిస్తుంది. కాలక్రమేణా క్యాన్సర్ గా మారవచ్చు. ఆ పాలిప్స్ పెద్ద ప్రేగు లేదా పురీష నాళం లోపలి పొర వెంట పెరుగుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్లే సమీపంలోని కణజాలాలపై దాడి చేసి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియను మెటాస్టాపిస్ అంటారు.
ఇటీవల కాలంలో పెద్ద ప్రేగు క్యాన్సర్ యువకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ వృద్దుల్లో ఎక్కువ ఉన్నా.. యువకుల్లో రోగనిర్దారణ ఇటీవల కాలంలో పెరిగింది.
మలరక్తస్రావం, ప్రేగు అలవాట్లలో మార్పులు, పొత్తికడుపు నొప్పి , అతిగా బరువు తగ్గడం వంటివి పెద్ద ప్రేగు క్యాన్సర్ తో లక్షణాలు.
పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల కొన్ని జీవన శైలీ మార్పులను డాక్టర్లు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించాలి ..
ఎర్ర మాంసం వినియోగంతో పెద్ద ప్రేగు క్యాన్సర్ వ్యాప్తి కావచ్చు. ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన లేదా కాల్చిన మాంసాలు, వంటచేసేటప్పుడు అధిక కొవ్వు , ప్రోటీన్ కంటెంట్ కారణంగా క్యాన్సర్ కు కారణమయ్యే సమ్మేళనాల ఉత్పత్తిని పెంచుతాయి. గ్రిల్లింగ్, స్మోకింగ్ వంటి రెడ్ మీట్ లో ఉపయోగించే ప్రాసెసింగ్ లేదా వంట పద్దతులు కూడా దీనికి కారణం కావొచ్చు. వీటి ద్వారా క్యాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెన్ లు ఉత్పత్తి అవుతంది. వీటికి బదులుగా మొక్కల ద్వారా లభించే ప్రోటీన్లను తీసుకోవాలి. చేపలలు, చికెన్ వంటి లీన్ ప్రోటీన్ మీల్స్ ఆరోగ్య కరమైన ప్రోటీన్ వనరులు.
తక్కువ చక్కెర తినాలి
చక్కురతో నిండిన డ్రింక్స్ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ , పెద్ద ప్రేగు క్యాన్సర్ కు కారణంగా కావచ్చు. షుగర్ ఎక్కువ గా తీసుకుంటే ఇన్సులిన్ నిరోధకత, ఉబకాయం పెరుగుతుంది. ఈ రెండు పరిస్థితులు అనేక క్యాన్సర్లను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లను మితంగతా ఉపయోగించాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఫైబర్ అధికంగా తినండి..
మలబద్దకం, రక్తంలో చక్కుర నియంత్రణ, గుండె, ప్రేగుల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటే పదార్థాలు చేర్చుకోవాలి. ఫలితంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ ను అభివృద్ధి చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది. పెద్ద ప్రేగు కదలికలను ప్రోత్సహించడం, జీవక్రియ సమయంలో ఏర్పడే క్యాన్సర్ కారకాల పరిమాణాన్ని తగ్గించడం వంటి చర్యలను డైటరీ ఫైబర్ చేస్తుంది.
ఆల్కహాల్ తగ్గించడం
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్లకు కొని తెచ్చుకున్నట్లే. నోరు, గొంతు, పెద్ద ప్రేగు, పురీషనాళం, కాలేయం, రొమ్ము క్యాన్సర్లకు ఇది ప్రధాన కారణం అవుతుంది. ఆల్కహాల్ తక్కువ తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుందని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది. ఆల్కహాల శరీరంలో డీఎన్ ఏను నాశం చేసి, కణాలు అనియంత్రితంగా పెరగడానికికారణం అవుతుంది. ఆ విధంగా ప్రాణాంతకమైన కణితులు పుడతాయి. సో.. యువకులు బీకేర్ ఫుల్.. చక్కని జీవన శైలితో క్యాన్సర్ కు దూరంగా ఉండండి.