ఫాదర్స్​డేని మొదలు పెట్టింది ఎవరు..?..ఆ ఆలోచన ఎలా వచ్చింది

ప్రతి ఏటా జూన్​ మూడో ఆదివారం ఫాదర్స్ డే సెలబ్రేషన్స్​ ప్రపంచమంతా చేసుకుంటారు. ఈ ఏడాది ఫాదర్స్​ డే జూన్ 16న వచ్చింది. మనదేశంతో పాటు 80 దేశాలు ఇదే రోజున ఫాదర్స్​ డేగా సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ, మరికొన్ని దేశాలు వేరే తేదీల్లోఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఆ దేశాలు ఏవి? ఎందుకు ఆ దేశాల్లో డేట్​ మారింది? ఆ వివరాలే ఇవి.

వా షింగ్టన్​కి చెందిన సొనొరా లూయీస్​ స్మార్ట్​ డొడ్​ ఫాదర్స్​డేని మొదలుపెట్టింది. ఆమె తండ్రి విలియం జాక్సన్​ స్మార్ట్​. ప్రసవ సమయంలో సొనొరా తల్లి చనిపోయింది. దాంతో అప్పటినుంచి ఆమెను, ఆమె ఐదుగురు సోదరులను తండ్రి ఒక్కడే పెంచాడు. 1909వ సంవత్సరంలో మదర్స్​డే నాడు తండ్రితో కలిసి సెంట్రల్​ మెథడిస్ట్​ చర్చ్​కి వెళ్లింది. అక్కడ మదర్స్​డే గురించి వింటున్నప్పుడు మిలిటరీలో పనిచేసిన తన తండ్రి ఒక్కడే తమ ఆరుగురిని పెంచాడు. అలాంటి తండ్రిని గౌరవించేందుకు ఒక రోజు లేకపోవడం బాధగా అనిపించింది.

అప్పుడు ఆమె ఫాదర్స్​ డే ఆలోచన గురించి అక్కడి పెద్దలకు చెప్పింది. అలా1910లో సొనొరా తండ్రి పుట్టినరోజు అయిన జూన్​ 5న ఫాదర్స్​ డేగా సెలబ్రేట్​ చేయాలి అనుకుంది. కానీ ప్లానింగ్​ చేయడం కష్టం కావడంతో  అదే ఏడాది  జూన్​ 19 ఆదివారం నాడు సెలబ్రేట్​ చేసింది. ఆమె ఆలోచన దేశం అంతా తెలిసింది. ఆ తరువాత ఫాదర్స్​ డే సెలబ్రేట్​ చేసేందుకు 1921లో వర్జీనియాలో ఒక కమిటీ, 1936లో న్యూయార్క్​ సిటీలో ఒక కమిటీ ఏర్పడ్డాయి.

1972లో ప్రెసిడెంట్​ రిచర్డ్​ డిక్సన్​ జూన్​ మూడో ఆదివారాన్ని ఫాదర్స్​డే నేషనల్ హాలీడేగా అధికారికం చేశారు. అలా మొదలైన ఫాదర్స్​ డే తరువాత ఇతర దేశాలకు పాకింది. ఇండియాలో కూడా ఈ డేని పలురకాల ఈవెంట్లతో గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్రాన్స్​లో అయితే తండ్రికి గిఫ్ట్ కార్డ్​లు ఇస్తుంటారు. ఆ గిఫ్ట్స్​​లో స్పోర్ట్స్ ఐటెమ్స్, బట్టలు, స్వీట్స్, చాకొలెట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అవుట్ డోర్ కుకింగ్​కి అవసరమైన వస్తువులు ఇస్తుంటారు.