ఒంటరితనం శారీరక, మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే దీర్ఘకాల విపరీత పరిణామాలకు దారితీసి పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO ) హెచ్చరించింది. ఒంటరితనం కుంగుబాటు, ఆందోళన, హృద్రోగం, స్ట్రోక్, డిమెన్షియా, అకాల మరణం వంటి ముప్పులకు కారణమవుతుంది. ఒంటరితనం సామాజికంగా, అనుబంధాల పరంగా మనిషిని ఏకాకిని చేస్తుందని, ఇది అంతర్జాతీయ ఆరోగ్య ముప్పుకారకంగా మారుతున్నదని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఒంటరితనం పెద్ద ఆరోగ్యసమస్యకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO ) నివేదికలో తెలిపింది.
ఒంటరితనం, దాని దుష్పలితాలను నివారించేందుకు జాతీయ వ్యూహాలను రూపొందించి అమలు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆయా దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఒంటరితనం, ఏకాకి జీవితం అంటువ్యాధి పేరుతో ప్రచురించిన నివేదికలో డబ్ల్యూహెచ్ఓ ఒంటరితనం వ్యక్తులు, సామాజిక ఆరోగ్యానికి విసిరే సవాళ్లను ప్రస్తావించింది.ఒంటరితనంతో హృద్రోగ ముప్పు, డిమెన్షియా, స్ట్రోక్, కుంగుబాటు, అలజడి, అకాల మరణం వంటి పెను ముప్పులు పొంచి ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఒంటరితనం రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమైన ప్రాణాంతకమని పేర్కొంది. ఊబకాయం, శారీరక చురుకుదనం కొరవడటం కంటే ఒంటరితనం ప్రమాదకరమని స్పష్టం చేసింది. నలుగురితో కలవలేకపోవడంతో వ్యక్తుల సామర్ధ్యం, ఉత్పాదకత క్షీణిస్తుందని ఈ నివేదికలో డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఒంటరినం ఆరోగ్యంపై చూపించే ప్రతికూల ప్రభావాలు
- మాసనిక సమస్యలు
- మద్యం తాగాలనిపించడం
- ఒంటరితనం వల్ల ఏవేవో ఆలోచనలు వచ్చి మెదడు పని తీరులో మార్పు
- అల్జీమర్స్ లక్షణాలు
ఒక్కోసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలుకూడా పాల్పడే అవకాశం
- గుండె జబ్బు వచ్చే అవకాశం
- డిప్రెషన్ లోనయి ఆత్మహత్యకు దారితీసే అవకాశం
- డిప్రెషన్ మరియు ఆత్మహత్య భావాలు
ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి మార్గాలు కొన్ని మార్గాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాటిని కూడా తెలుసుకుందాం. . .
- మాసనిక, శారీరక ఆరోగ్యం కోసం కొంతమందితో ఇష్టాగోష్టిగా చర్చించడం
- స్వచ్చంద సంస్థల్లో కమ్యూనిటి సభ్యునిగా ఉండి.. సామాజిక చర్చల్లో పాల్గొనడం
- కొత్త వ్యక్తులను కలుసుకొనేందుకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం
- సామాజికంగా ప్రజలను చైతన్యపర్చి్చేందుకు కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందించడం
- మీ ఆలోచనలను.. ఇష్టాలను.. ఇతర విషయాలను ఇతరులతో పంచుకోండి.
- సమాజంలోని మీకిష్టమైన వ్యక్తులతో సంబంధాలు పెంపొందించుకోండి
- ఒంటరిగా ఉండకుండా.. నలుగురిలో కలిసి ఉండేందుకు ప్రయత్నించండి
- జిమ్ సెంటర్లు, వ్యాయామ సెంటర్లలో చేరండి. మిమ్మలను మీరు ఫిట్ గా ఉండేలా చేసుకోండి
- దేవాలయాలు.. గుళ్లు.. తీర్థయాత్రలు లాంటివి చేయండి.
- తోటి వ్యక్తలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయండి.