1GB, 2GB బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే.. ఏ నెట్ వర్క్ అయితే మీ డబ్బులు ఆదా అంటే..!

ఇటీవల అన్నీ టెలికాం కంపెనీలు వాటి రీఛార్జ్ ప్లాన్లును  పెంచాయి. దీంతో  మెబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి యూజర్లు లబోదిబో మంటున్నారు. ఇండియాలోని జియో, ఎయిర్‌టెల్, Vi  వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు అన్నీ రీఛార్జ్ ప్యాక్ లను దాదాపు 15 శాతం పెంచాయి. అయితే డబ్బులు ఊరికే రావు.. అంటూ వినియోగదారులు ఏ రీఛార్జ్ ప్లాన్ తో ఎక్కువ బెనిఫిట్స్ పొందుతామనే ఆలోచనలో పడ్డారు.

వేరే నెట్ వర్క్ కు ఛేంజ్ అవుదామా అనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనూ ఏ నెట్ వర్క్, ఏ ప్యాక్ తక్కువ ధరతో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్స్ ఇస్తోందో అని వెతకడం ప్రారంభించారు. అన్ని నెట్ వర్స్ ను పోల్చి ఏ రీఛార్జ్ ప్లాన్ బెట్టరో మీకు అందిస్తున్నాం.. ఇదిగో..

Also Read :- జియో సిమ్ వాడుతున్నారా..?

టాప్ నుంచి బెస్ట్ ప్రీపెయిడ్ డేటా ప్యాక్స్ ఇవే.. 

  • BSNL : రూ.16తో ఒక రోజుకు 2GB డేటాను పొందవచ్చు.
  • జియో : రూ.19 తో1GB డేటా, రూ. 29తో 2GB జియో అందిస్తుంది. ఇవి బేస్ ప్లాన్ యొక్క చెల్లుబాటు వరకు చెల్లుతుంది.  
  • ఎయిర్‌టెల్ : రూ.22తో 1GB,  రూ. 33తో 2 GB డేటాను అందిస్తుంది. ఇవి ఒక్క రోజు లిమిట్ మాత్రమే. 
  • VI  :  రూ.22తో 1GB,  రూ. 33తో 2 GB డేటాను అందిస్తుంది. ఇవి రెండు రోజుల చెల్లుబాటులో ఉంటుంది.

అన్నీ నెట్ వర్కులతో పోల్చి చూస్తే..

Jio రూ.19లకే 1GB, రూ.29కి 2GB డేటా ప్యాక్‌లను ఇస్తుంది. ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్యాక్‌లు ఒక రోజు, 2డేస్ లిమిట్ లేదు.. బేస్ ప్లాన్ గడువు ముగిసే వరకు చెల్లుతాయి. 
BSNL రూ.16లకే చౌకైన డేటా ప్యాక్‌ను అందిస్తుంది. ఇది ఒక రోజుకి 2GB డేటాను ఇస్తుంది. BSNL 2G/3G నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నప్పటికీ, 4G సర్వీస్ కొన్ని కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. 
Airtel డేటా ప్యాక్‌లు అత్యంత ఖరీదైనవి. ఎందుకంటే దాని 1GB, 2GB రీఛార్జ్ ప్లాన్‌లు ఒక రోజు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అదే విధంగా VI కూడా.