Pathogens List : WHO అలర్ట్ : రాబోయే కాలానికి కాబోయే పాండమిక్‌లు ఇవే.. 30 భయంకరమైన వ్యాధుల లిస్ట్

ప్రపంచ ఆరోగ్యం సంస్థ రాబోయే కాలంలో ప్రజల్ని పీడించే భయంకర వ్యాధుల లిస్ట్ విడుదల చేసింది. 2024 జూలై 30న UN హెల్త్ ఏజెన్సీ పాండమిక్ సృష్టించబోయే వ్యాధికారకాల జాబితాను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ కలుగజేసే వ్యాధి కారక జీవులను WHO గుర్తించింది. రెండు సంవత్సరాలపాటు 200 మందికి పైగా సైంటిస్టులు 1,652  వ్యాధికారక జాతులపై పరిశోధనలు చేశారు. 30 ప్రమాదకర సూక్ష్మజీవులు హాని కరమైన వ్యాధులు కలిగిస్తాయని ఈ పరిశోధనలో తేలింది.  

ఇన్ ఫ్లుఎంజాA వైరస్, డెంగ్యూ, మంకీపాక్స్ వైరస్ లు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అంతేకాదు 5 కొత్త బ్యాక్టీరియా జాతులు కూడా ఇందులో ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇటీవల ఇండియాలో కలవరం రేపుతున్న నిపా వైరస్ కేసులు కూడా లిస్ట్ లో ఉన్నాయి. గతంలో కూడా WHO 2017లో 12 మహమ్మరుల జాబితాను విడుదల చేసింది. ఆయా ప్రమాదకర వైరస్ ల బారి నుంచి రక్షించుకోవడానికి ప్రోటోటైప్ పాథోజెన్ ల జాబితాను కూడా UN హెల్త్ ఏజెన్సీ విడుదల చేసింది. ట్రీట్ మెంట్, టీకాల డెవలప్ మెంట్ల గురించి వివరించారు.