ఆవును నరికి చంపిన దుండగులు.. క్లూస్​టీం,డాగ్​స్క్వాడ్​ బృందాలతో పోలీసుల విచారణ

  • క్లూస్​టీం,డాగ్​స్క్వాడ్​ బృందాలతో పోలీసుల విచారణ
  • అంతిమయాత్ర నిర్వహించిన భజరంగ్​దళ్​సభ్యులు

 లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చాకలి కాంతయ్య అనే రైతుకు చెందిన ఆవును గొడ్డలితో కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు.​  కాంతయ్యకు పది పశువులు ఉన్నాయి. రోజులాగే  పశువులను గ్రామ సమీపంలో కట్టేశాడు.  రాత్రివేళ పశువులకు మేత వేశాడు.  ఉదయం వచ్చేసరికి ఆవు రక్తపు మడుగులో పడి ఉంది. 

బాధితులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​, సీఐ రవీందర్​, లింగంపేట ఏఎస్​ఐ ప్రకాశ్​ ఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన ఆవును పరిశీలించారు. సీసీఎస్​,క్లూస్​టీం,డాగ్​స్క్వాడ్​ బృందాలను రప్పించి గాలింపు చేపట్టారు. స్థానిక పశువైద్యురాలు అన్న జోనస్​ మృతి చెందిన ఆవుకు పోస్టుమార్టంనిర్వహించారు.  నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ శ్రీనివాస్​ రెండు బృందాలను ఏర్పాటు చేశారు.