కార్తీకపురాణం : దశరథుడికి ముందు అయోధ్యను ఎవరు పాలించారో తెలుసా...

పూర్వం నైమిశారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు  సత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. ఈ కార్తీక మహాత్మ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి వున్నారు.  లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మ చే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది.  త్రేతా యుగంలో రామ జన్మభూమి అయ్యోధ్యను ఎవరు పాలించారు.. ఆ రాజు పాలన ఎలా ఉందో కార్తీకపురాణంలో 20వ అధ్యాయంలో తెలుసుకుందాం. . . . .


పురంజయుడు దురాచారుడగుట

జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో  గురువర్యా! కార్తీక మాసమహాత్మ్యమును యింకా విన వలయునని  కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యములో ఇంకా  విశేషములు గలవా! అను సంశయము  కలుగుచున్నది.            ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగా జేయుడనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో   ఓ రాజా! కార్తీక మాసమహాత్మ్యము గురించి అగస్త్య మహాముని....  అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదను  ఆలకించుమని అ కథా విధానమును యిట్లు వివరించిరి.

పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మహాత్మ్యమును నీకు ఆ మూలాగ్రమున తెలియును .. కావున దానిని నాకు వివరింపుము అని కోరెను.  అంత అత్రిమహాముని కుంభ సంభ ! నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరముగుటచే ఉత్త మమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడులేడు.  ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధ న చేసిన ను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము.

 త్రేతాయుగా మును పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞాన హీనుడై దుష్ట బుద్ది గలవాడై దయాదాక్షి ణ్యములు లేక ..దైవ,  బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై,చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్ల గొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీసికొనుచు ప్రజలను భీతావహులను ( భయకంపితులను)  చేయుచుండెను. ఇటుల కొంత కాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను.

ఈవార్త కాంభోజ రాజును నాయకునిగా చేసుకొని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులైర హస్యమార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలు వైపులా శిబిరములు నిర్మించి నగర మును దిగ్భ౦ధముచేసి యుద్ద మునకు సిద్దపడిరి. అయోధ్యా నగరమును ముట్ట డి౦చిన సంగతిని చారులవలన తెలిసికొనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దు డై యుండెను. అయినను యెదుటి పక్షము వారధి కబలాన్వితులుగా నుండుటయి తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రాథ మెక్కి సైన్యాధ పతులను పూరి కొల్పి,చతురంగ బల సమేత మైన సైన్యముతో యుద్ద సన్నద్దు డై -న వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.


 ఇతి స్కాంద పురాణే కార్తీక పురాణం.. వింశాద్యాయము పారాయణం సంపూర్ణం. . . 


 -ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.