మనోళ్లు ఎక్కడా తగ్గట్లే.. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా ఛాన్స్ కొట్టేసిన భారతీయుడు

సాఫ్ట్ వేర్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో భారతీయులు దూసుకుపోతున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల్లో భారతీయులు టాప్ పొజిషన్ లో ఉండి టెక్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. తాజాగా మరో ఇండియన్ కు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు సలహాదారుగా పనిచేసే అవకాశం దక్కింది. డొనాల్డ్ ట్రంప్ కు ఏఐ (Artificial Intellegence) సలహా దారుగా భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ ఎంపికయ్యారు. శ్రీరామ్ ను తన AI సలహాదారుగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 

ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ కు సంబంధించి  సీనియర్ వైట్ హౌజ్ పాలసీ అడ్వైజర్ గా శ్రీరామ్ ను కాబోయే అధ్యక్షుడు ట్రంప్ నియమించారు.‘‘ వైట్ హౌజ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆర్టిఫియల్ ఇంటిజెన్స్ పాలసీ సీనియర్ అడ్వైజర్ గా నియమిస్తున్నా’’మని  ట్రంప్ తెలిపారు. అదే విధంగా డేవిడ్ సాక్ తో కలిసి కృత్రిమ మేధ విషయంలో అమెరికాను ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేస్తారని ట్రంప్ తెలిపారు. 

Also Read :- మీ అకౌంట్ ఉన్న బ్యాంకు మూతపడితే ఏమి చేయాలి..?

శ్రీరామ్ప్రభుత్వ సంస్థలలో ఏఐ వినియోగం, సాంకేతిక మార్పుకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో సలహాదారలతో పనిచేయనున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో కెరీర్ ప్రారంభించి విండోస్ అజూర్ (Windows Azure) నిర్మాణంలో కీలక పాత్ర పోశించిన శ్రీరామ్.. ట్రంప్ సలహాదారుగా నియామకం కావడం గొప్పవిషయం. 

శ్రీరామ్ కృష్ణన్ నేపథ్యం:


శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని చెన్నైకి చెందినవాడు. ఎస్ఆర్ఎమ్ వలియమ్మై ఇంజినీరింగ్ కాలేజీ నుండి బీటెక్ పూర్తయిన తర్వాత మైక్రోసాఫ్ట్ తో కెరీర్ ను ప్రారంభించాడు. విండోస్ అజూర్ (Windows Azure) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. ఈ సాఫ్ట్ వేర్ పై తనకున్న అనుభవంతో ‘Proggramming Window Azure’ అనే పుస్తకాన్ని రచించారు. 

2013లో ఫేస్ బుక్ లో చేరి కంపెనీ ప్రకటనలకు సంబంధించిన యాప్ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత స్నాప్ చాట్ లో కూడా కొన్నాళ్లు పనిచేశారు. 2019 వరకు ట్విట్టర్ (ప్రస్తుతం X)లో పనిచేశారు. ఎక్స్ ను రీస్ట్రక్చర్ చేయడంలో ఎలన్ మస్క్ కు సహకారం అందించారు.  శ్రీరామ్ క్రిష్ణన్ స్వతహాగా ఇన్వెస్టర్ కూడా. ఇండియన్ ఫింన్ టెక్ కంపెనీ క్రెడ్  (Cred)కు సలహాదారగా పనిచేశారు. తన భార్య ఆర్తి రామమూర్తి నిర్వహిస్తున్న ‘The Aarthi and Shriram Show’ పాడ్ కాస్ట ప్రోగ్రామ్ కు కో హోస్ట్ గా పనిచేస్తుంటాడు. 

ఏఐ సలహాదారుగా ట్రంప్ నియమించిన తర్వాత ట్రంప్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీరామ్ ట్వీట్ చేశారు. దేశానికి సేవ చేయడం చాలా గౌరవంగా భావిస్తానని, డేవిడ్ సాక్స్ తో కలిసి AI విషయంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంపొందిచేలా కృషి చేస్తానని శ్రీరామ్ తెలిపారు.