బంగాళ దుంపలు, చిలకడ దుంపలు రెండూ వేర్వేరు రుచులను కలిగి ఉంటాయి. అయితే చిలకడ దుంపల్లో తీయటి గుణం ఉంటుంది. అందుకే దీనిని స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో ఈ రెండిటిలో ఉండే ఆరోగ్య లక్షణాలను ఆరోగ్య నిపుణులు పరిశీలించారు. బంగాళదుంపలకు... చిలకడదుంపలకు మధ్య ఉన్న తేడాతో పాటు ఎందులో ఏరకమైన పోషకాలున్నాయో తెలుసుకుందాం. .. .
కేలరీల కంటెంట్
తెల్ల బంగాళాదుంపలు ఎక్కువ కేలరీల శక్తిని అందిస్తాయి. వీటిలో సగటున 100 గ్రాముల బంగాళ దుంపలు 130 కేలరీల శక్తిని శరీరానికి అందిస్తాయి. అయితే 100 గ్రాముల చిలకడ దుంపల్లో ( స్వీట్ పొటాటోస్) దాదాపు 86 కేలరీల శక్తిని మాత్రమే అందించగలవు. ఇవి తక్కువ కేలరీల కౌంట్ ను అందిస్తాయి. కేలరీల విషయంలో ఈ రెండిటి మధ్య స్వల్ప తేడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్లు
బంగాళదుంపల్లో కార్బొహైడ్రేడ్లు చాలా ఎక్కువుగా ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. బంగాళ దుంపల్లో తీపి దనం లేకపోయినా రక్తంలో గ్లూకోజ్ నిల్వలను పెంచుతాయి. ఇక చిలకడ దుంపలు కార్బోహైడ్రేట్లతో పాటు ఫైబర్ కూడా కలిసి ఉంటుంది. ఇందులో విడుదదలయ్యే శక్తి ( పవర్) చాలా ఎక్కువుగా ఉంటుంది. చిలకడ దుంపలు రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రిప్తాయి,
గ్లైసెమిక్ వివరాలు
గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది శరీరంలో ఒక కీలకమైన అంశం, షుగర్ పేషంట్లు బంగాళదుంపలను తినకపోవడం మంచిది. తెల్ల బంగాళాదుంపలు అధిక GIని కలిగి ఉంటాయి, ఇది రక్తంలో చక్కెరస్థాయిని త్వరగా పెంచుతుంది. ఇక చిలకడదుంపలు (తియ్యటి బంగాళాదుంపలు) తక్కువ GIని కలిగి ఉంటాయి. అయితే ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిదానంగా పెంచుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. . మధుమేహం ఉన్న వారు దాని తీవ్రతను ఈ రెండిటిని వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి.
పోషకాలు
బంగాళదుంపలు.. చిలకడదుంపలు ఈ రెండూ కూడా సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. తెల్ల బంగాళ దుంపల్లో పొటాషియం, విటమిన్ సి మరియు విటమిన్ B6 వంటి పోషకాలుంటాయి. ఇక చిలకడదుంపల్లో అధిక స్థాయిలో బీటా కెరోటిన్, విటమిన్ A, విటమిన్ C, మాంగనీస్ వంటి పోషక పదార్దాలుంటాయి. శరీరానికి పోషకపదార్దాలను అందించడంలో ఈ రెండూ కూడా కీలకపాత్రను పోషిస్తాయి.
ఫైబర్
చిలగడదుంపలోని ఫైబర్ కంటెంట్... తెల్ల బంగాళాదుంపలలో కంటే ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని అలసట లేకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.