Cooling paint : ACలకు గుడ్ బై చెప్పండి : ఈ పెయింట్ వేస్తే చాలు.. సూపర్ కూలింగ్

శీతాకాలం, వర్షాకాలం, వేసవి కాలం ఇలా సీజన్ ఏదైనా ఎండలు మాత్రం మండిపోతున్నాయి. గోబ్లల్ వార్మింగ్ తో భూమి వేడెక్కిపోతుంది. వేడి తాపానికి తట్టుకోలేకు ప్రజలు వేలు వేలు ఖర్చుచేసి ఏసీలు, కూలర్లు విపరీతంగా కొంటున్నారు. ఏసీల వాడకం పెరగడంతో పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సైంటిస్టులు ఓ అద్భుతాన్ని కనుగొన్నారు. 

పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన  మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫ్రెసర్ జియలిన్ రువాన్ ఓ పెయింట్ ను కనుగొన్నాడు. ఇది ఇంట్లోకి ఉష్ణోగ్రతను చేరనివ్వదు. తెల్లటి ఈ పెయింట్ దాని ఉపరితలంపై పడిన సూర్యకిరణాలను 98 శాతం ప్రతిబించేలా చేస్తాయట. 

రువాన్ కనిపెట్టిన ఈ పెయింట్ వేసిన బిల్డింగుల్లో పగలు ఎనిమిది డిగ్రీలు, రాత్రి 19 డిగ్రీల వరకూ చల్లగా ఉంచుతుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఎయిర్ కండిషనర్ల కంటే ఎక్కువ శక్తివంతంగా ఇవి పనిచేస్తాయని రువాన్ చెప్తున్నారు.. ఆయన తర్వతో వాహనాల్లో కూడా ఉష్ణాన్ని నిరోధించే విధంగా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. 

2021లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచంలోనే అత్యంత తెల్లని పెయింట్ అని దీన్ని పేర్కొంది.. కానీ.. రువాన్ తాను ఈ పెయింట్ ను తయారు చేసిన ఉద్దేశ్యం ఇది కాదని అన్నారు. రంగు కోసం ఆయన పేయింట్ తయారు చేయలేదని.. ఉష్ణోగ్రతను నిరోధించడానికే పెయింట్ తయారు చేశామన్నారు. ప్రస్తుతం దీనిపై టెస్టులు జరుగుతున్నాయి.