బ్యాటరీ పేలి.. కాలిపోయిన ఎలక్ట్రిక్ బైక్

సూర్యాపేట జిల్లాలో ఛార్జింగ్ పెడుతుండగా..బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైన సంఘటన జరిగింది. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగా బైక్ మొత్తం మంట్లో కాలి బూడిదయ్యింది. 

మంగళవారం జూలై 23, 2024న చిలుకూరు  చిలుకూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు తన ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ పెట్టారు. అయితే ఛార్జింగ్ కాకపోవడంతో స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో వెళ్లాడు.. కొద్దిసేపటికే బైక్ లోని బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది.