టూత్ పేస్ట్ నుంచి సబ్బు బిళ్ల దాకా ప్రతి వస్తువుకి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో మనం రోజూ వంటచేసుకునే నాన్ స్టిక్ పాన్ కూడా ఉంది. వీటిని ఎక్స్ పైరీ డేట్ దాటాక వాడితే లేనిపోని తిప్పలు వచ్చిపడతాయి. నాన్ స్టిక్ పాన్ల ఎక్స్ పైరీని ఇలా గుర్తించాలి.
• వేడి, తేమ వల్ల నాన్ స్టిక్ లు కొన్నిరోజులకి వంగిపోతాయి. దానివల్ల ఫుడ్ సరిగా ఉడకదు. ఆ ఫుడ్ తింటే సరిగ్గా అరగదు.
• నాన్ స్టిక్ పాన్ డార్క్ కలర్లోకి మారిందంటే దానిపై ఉండే కోటింగ్ పోయినట్టే. అది ఫుడ్లో కలిస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
• పగుళ్లు వచ్చిన పాన్ ను వాడకూడదు. ఎందుకంటే.. నాన్ స్టిక్ పాన్లో వాడే టెఫ్లాన్లో పర్ ఫ్లూరోక్టానిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా స్టడీల్లో తేలింది. పగుళ్లు వచ్చిన పాన్లు వాడితే ఆ కెమికల్ ఫుడ్లో కలిసి ఆరోగ్యానికి చేటు తెస్తుంది.
• నాన్ స్టిక్ వస్తువులు ఏవైనా సరే ఐదేళ్లకి మించి వాడొద్దు. వాటిల్లో వారానికి మూడు నాలుగుసార్లు వంట చేస్తుంటే నాలుగేళ్లకే మార్చాలి అంటున్నారు. ఎక్స్ ఫర్ట్స్.
• అలాగే నాన్ స్టిక్ పాన్లని వేడి మీద కడగకూడదు. నాన్ మెటాలిక్ స్క్రబ్బర్ తోనే క్లీన్ చేయాలి.