టేస్టీ అండ్ హెల్దీ కాంబినేషన్ రెసిపీలు బోలెడు ఉన్నాయి. వాటిల్లో గోధుమ, బాదం - నువ్వుల లడ్డూలు ముందు వరుసలో ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ లో ట్రై చేయండి.
గోధుమ లడ్డు..
కావాల్సినవి :
గోధుమ పిండి, నాలుగు కప్పులు నెయ్యి : ఒకటించావు కప్పు చక్కెరపొడి : రెండు కప్పులు నల్ల యాలకుల పొడి, యాలకుల పొడి : ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున డ్రై ఫ్రూట్స్ పలుకులు : ముప్పావు కప్పు, తయారీ : పాన్ లో నెయ్యి వేడి చేసి గోధుమ పిండిని వేసి ఉండలు లేకుండా వేగించాలి. డ్రై ఫ్రూట్స్ తరుగు, చక్కెర పొడి వేసి మరికాసేపు వేగించాక, కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారక ముందే.. బడ్డూలు చుట్టాలి.
బాదం నువ్వుల లడ్డు...
కావాల్సినవి :
నువ్వులు: ఒక కప్పు, బాదం పప్పులు : అరకప్పు ఖర్జూర లేదా బెల్లం తరుగు : ముప్పావు కప్పు యాలకుల పొడి : పావు టీ స్పూన్
తయారీ :
నువ్వుల్ని నూనె వేయకుండా దోరగా వేగించాలి. తర్వాత అరకప్పు బాదం పప్పుల్ని కూడా వేగించాలి. వేగిన బాదం పప్పుల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అదే జార్లో నువ్వుల్ని కూడా వేసి, మెత్తని పిండిలా మిక్సీ పట్టాలి. ఖర్జూర లేదా బెల్లం తరుగు, యాలకుల పొడితోపాటు కావాలంటే తేనె కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని లడ్డూలు చేయాలి. నెయ్యి, చక్కెర వేయకుండా చేసిన ఈ లడ్డూ చాలా హెల్దీ.