వాట్సాప్‌లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ బ్లాక్..!

ప్రపంచంలో ఎక్కువగా వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనికి బిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇన్ని రోజులుగా మంచి మంచి అప్డేట్స్ ఇంచి కొత్త ఫీచర్ యాడ్ చేసిన వాట్సాప్ ఒక్కసారిగా తన యూజర్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వాట్సాప్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నట్లు, తప్పుడు సమాచారం షేర్ అవుతున్నట్లు మెటా సంస్థ గుర్తించింది. భారత్‌లో వచ్చిన కొత్త ఐటీ చట్టం కూడా వాట్సాప్ యాజమాన్యానికి చాలా నిబంధనలు పెట్టింది. తాజాగా ఈ విషయంలో వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తన వివరణ కూడా ఇచ్చింది. కఠినమైన రూల్స్ పెడితే భారత్ నుంచి వెళ్లిపోతామని వాట్సాప్ కోర్టులో చెప్పింది. 

కానీ వాట్సాప్ అలా చేయదు. ఎందుకంటే ఇండియాలో ఆ యాప్ కు చాలామంది యూజర్లు ఉన్నారు. పైకి అలా చెప్పినా, వినియోగదారులపై ఒత్తిడి తేకుండా వాట్సాప్ నెమ్మదిగా ఒక్కొక్కటిగా రూల్స్ పాటిస్తుంది. యూజర్లపై నిఘూ పెట్టడం ప్రారంభించింది. ఈ మేరకు వాట్సాప్ లో ఫేక్ న్యూస్ ఫార్వడ్ చేసినా, అశ్లీల చిత్రాలు పంపినా, స్పామ్ మెస్సేజ్ లు, ఆటోమెటెడ్ బల్స్ మెస్సేజ్ లు పంపినా తాత్కాలికంగా వాళ్ల అకౌంట్ బ్లాక్ చేస్తామని వాట్సాప్ హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్ తర్వలోనే వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ యూజర్లకు అమలు చేస్తామని.. దానిపై టెస్టింగ్ జరుగుతుందని ఆ సంస్థ చెప్పింది.  

వాట్సాప్ లో ఇప్లిమెంటేషన్ చేయనున్న రూల్స్ పై కసరత్తు జరుగుతుంది. ఈ వాట్సాప్ ఫీచర్ అప్డేట్ చేస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో వాట్సాప్ దాని రిస్ట్రక్షన్స్ అమలు చేయబోతుంది. రూల్స్‌కు విరుద్ధంగా ఏం చేసినా మీ అకౌంట్ ఆటోమాటిక్‌గా కొన్ని రోజులు బ్లాక్ అవుతుంది. అప్పుడు మీరు చాట్ చేయలేరు. వాట్సాప్ యూస్ చేయలేరు. అలాగే అన్ బ్లాక్ చేసుకోవాలంటే పెనాల్టీ కట్టాలి. ఆ పెనాల్టీ మీరు చేసిన రూల్స్ వైలేషన్ ని బట్టి ఉంటుంది. ఈ అప్డేట్ వచ్చాక కొత్త వక్తులతో చాట్ ప్రారంభించేటప్పుడే ఓ పాప్ అప్ బాక్స్ వార్నింగ్ ఇస్తుంది.