వాట్సాప్లో అద్భుతమైన కొత్త ఫీచర్.. ఫేక్​లింక్స్ను వెంటనే గుర్తించొచ్చు

ఇటీవల కాలంలో మేసేజింగ్​ అప్లికేషన్లతో ఫేక్​ న్యూస్​ బాగా స్ప్రెడ్​ అవుతోంది. ఈ మేసేజ్​ల ద్వారా  సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి తప్పుడు సమా చారాన్ని పంపించేందుకు ఇన్స్టాగ్రామ్, X(గతంలో ట్విట్టర్), వాట్సాప్​ వంటి మేసేజింగ్ యాప్లను కూడా వాడుకుంటున్నారు. సైబర్​ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాట్సాప్​ తన వినియోగదారులకోసం ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కొత్తగా సేఫ్టీ ఫీచర్​ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. 

ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్​ యూజర్లు యాప్​ ద్వారా వచ్చే వెబ్​ లింకులను, మేసేజ్​లలో సమాచారం నిజమైందా కాదా అని క్రాస్​ చెక్​ చేసుకునే అవకాశం ఉంది. లింక్ ను క్లిక్​ చేసినప్పుడు అది సరియైన మేసేజ్​ ను మాత్రమే గూగుల్​ ద్వారా అప్​లోడ్ చేస్తుంది. ఈ రిఫైన్డ్​ ఫీచర్​ ద్వారా యూజర్లు హానికరమైన లింక్​ లను గుర్తించడం, తగిన చర్యలు తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది.ఈ ఫీచర్​ను వాడాలా వద్దా అనేది యూజర్ పై ఆధారపడి ఉంటుంది. సెలక్ట్​చేసుకుంటే మాత్రమే పని చేస్తుంది. 

Also Read :- 80వేల ఏండ్ల నాటి తోకచుక్క

ఈ కొత్త ఫీచర్​ లేటెస్ట్​ అండ్రాయిడ్​ వాట్సాప్​ బీటా వెర్షన్​ 2.24.20.28లో ప్రస్తుతం టెస్టింగ్ దశలో కనిపిస్తుంది. ఏదైనా లింక్​ కొత్త కాంటాక్ట్​ నుంచి గానీ, తెలిసిన నంబర్​ నుంచి గానీ వస్తే దానిపై ‘‘సెర్చ్ ఆన్​ వెబ్’’ ఆప్షన్​ కనిపిస్తుంది. ఈ ఆప్షన్​ క్లిక్ చేస్తే మీకు వచ్చిన మేసేజ్​సరియైందో కాదో తెలుసుకునేందుకు గూగుల్​ లో సెర్చ్ చేస్తుంది. అందులో ఎలాంటి అఫిషియల్​ న్యూస్​ దొరక్కపోతే అది ఫేక్​ న్యూస్​ అని నిర్దారిస్తుంది.