వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. స్పామ్ మెసేజ్‌లను నిరోధించండిలా..

మీరు గృహిణులా..!  రిటైర్డ్ ఉద్యోగులా..! ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా.. ప్రతిరోజు వేలల్లో సంపాదించుకోండి. 5 లక్షల రూపాయల రుణం పొందడానికి మీరు అర్హత పొందారు.. ఒక్క క్లిక్ చేయండి చాలు. లాంటి మెసేజులతో విసిగిపోతున్నారా? ఈ పీడకు ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ విరుగుడు కనిపెట్టింది. 

ఏది స్కామ్‌, ఏది స్పామ్‌? దేనిని నమ్మాలో.. నమ్మకూడదో తెలియక మోసపోతున్న సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ఊరటనిచ్చేలా సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సెక్యూరిటీ ఫీచర్ వినియోగదారులకు అవాంఛిత సందేశాల అయోమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని వాబీటా(WABetaInfo) ఇన్ఫో పేర్కొంది.

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, తెలియని ఖాతాల నుండి సందేశాలు వచ్చినపుడు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ రూపంలో తెలుసుకుందాం.. స్పామ్ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకునే విధానం

  • మొదట వాట్సప్ ఓపెన్ చేసి.. కుడి వైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. 
  • అనంతరం సెట్టింగ్‌ ఆప్షన్ ఎంచుకొని.. ప్రైవసీ(Privacy) విభాగంపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు కిందకు స్క్రోల్ చేస్తే.. అడ్వాన్స్‌డ్(Advanced) అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దానిని క్లిక్ చేయండి.
  • ఇక్కడ ప్రొటెక్ట్ ఐపీ అడ్రెస్ ఫ్రమ్ కాల్స్ (Protect IP address in calls) కనిపిస్తుంది.. దానిని ఎనేబుల్ చేయండి.

WhatsApp ఇతర ఫీచర్లు

స్పామ్ బ్లాకింగ్‌తో పాటు, వాట్సాప్ కొత్త AI- పవర్డ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది వినియోగదారులకు కస్టమ్ స్టిక్కర్‌లు రూపొందించడానికి సహాయ పడుతుంది.