త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలా వాట్సాప్ స్టేటస్ : ఆ కొత్త అప్‪డేట్ ఏంటంటే?

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం వాట్సాప్ త్వరలో మరో కొత్త అప్‌డేట్ ప్రకటించనుంది. ఆండ్రాయిడ్ 2.24.23.21 వర్షన్ కోసం వాట్సాప్ బీటాలో కొత్త ఫీచర్స్ అందజేసే అప్ డేట్ రిలీస్ చేయనుంది. దీంతో వాట్సాప్ యూజర్లు స్టేటస్ పెట్టేటప్పుడు యాడ్ యువర్ స్టికర్, మెన్షన్ కొత్త ఫీచర్లు పొందుతారు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు 400కోట్ల మంది యూజర్లు ఉన్నారు. యూజర్ల ఎంగేజ్మెంట్ పెంచడం, యాప్ వాడకంలో ఎలాంటి సమస్యలు రాకుండా వాట్సాప్ మంచి అప్డేట్లను ప్రకటిస్తోంది. 

ALSO READ : సేఫ్టీ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో మారుతి డిజైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 స్టార్ రేటింగ్‌‌‌‌‌‌‌‌

వాట్సాప్ ఫ్లాట్ ఫాంలో యాడ్ యువర్ స్టికర్‌తోపాటు ట్యాగ్ చేసే ఆప్షన్లు త్వరలోనే రానున్నాయి. వాట్సాప్ ఈ ఫీచర్లను ఎపపుడు ప్రకటిస్తోందో సరిగ్గా టైం చెప్పలే కానీ.. అతి త్వరలోనే వాటిని యూజర్లకు అందుబాటులో ఉంచుతామని ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది. ఇకపై వాట్సాప్ స్టేటస్‌లో ఎవరినైనా ట్యాగ్ చేస్తే వారికి నేరుగా ఆ స్టేటస్ మెస్సేజ్ వెళ్తోంది. అంతేకాదు వారి స్టేటస్, మెస్సేజ్‪లకు స్టికర్ తో రిప్లే కూడా ఇవ్వొచ్చు. ప్లాట్‌ఫారమ్ స్టేటస్‌లో మెన్షన్ అనే కొత్త ఫీచర్‌ను రానుంది. ఈ ఫీచర్‌లో మీరు మీ స్టేటస్‌లో ఎవరినైనా మెన్షన్, అందులో ట్యాగ్ చేయబడిన వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్తోంది. Wabetainfo ఎక్స్ లో ఈ ఫీచర్ త్వరలో వస్తోందని ప్రకటించింది కానీ, సరిగ్గా ఎప్పుడు వస్తోందో చెప్పలేదు. 2024లోపే యాడ్ ఆన్ స్టికర్, మెన్షన్ ఫీచర్లు యూజర్లకు అంబాటులోకి వస్తాయి.