వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాయిస్ను టెక్ట్స్గా మార్చే కొత్త ఫీచర్..

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వినియోగదారులకు కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది.. వాట్సాప్ ద్వారా వచ్చిన వాయిస్ మెసేజ్ లను టెక్ట్స్ రూపం లో అందిస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ఎంతో కాలంగా కృషి చేస్తోంది.. ప్రస్తుతం వాట్సాప్ ప్రయత్నం తుది దశకు చేరుకుంది.. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.. త్వరలో వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులో రానుంది.. 

ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మేసేజ్ లను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల వాయిస్ నోట్ లో ఏం చెప్పినా నోట్ చేసుకోవడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. కొత్త గా ప్రారంభించబడిన ఈ ఫీచర్ హిందీతో పాటు ఇతర భాషల నోట్ కూడా నోట్ చేయగలదు.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

ALSO READ | WhatsApp: వాట్సాప్ వాడుతున్నారా.. పండగ చేస్కోండి.. ఇది ఎంత గుడ్ న్యూస్ అంటే..

వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్ ను ఎలా ఉపయోగించడం ఎలా.. 
WhatsApp వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్‌ని చాట్‌లలో యాక్సెస్ చేయవచ్చు.యాప్ సెట్టింగ్‌ల ద్వారా ఎనేబుల్ చేయవచ్చు. ఫీచర్ మొబైల్ యాప్‌కు ప్రత్యేకమైనది. అయితే వెబ్ వెర్షన్‌కు మద్దతు ఇవ్వదు. ఇది ఐదు భాషలలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ , హిందీ, వినియోగదారులు వారి ఫోన్‌లలో నేరుగా వాయిస్ నోట్స్‌ని టెక్ట్స్ రూపంలో మార్చేందుకు అందుబాటులో ఉంది. 

ALSO READ | బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. తిప్పలు తప్పనున్నయ్..!

మీరు ఫీచర్‌ని ఎలా యాక్టివేట్ చేయవచ్చో ఇక్కడ ఉంది. మీ WhatsApp యాప్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లండి. చాట్‌లపై క్లిక్ చేయాలి. ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి మీకు టోగుల్ బార్ కనిపిస్తుంది. యాక్టివేట్ చేసిన తర్వాత వాయిస్ నోట్స్ దిగువన ట్రాన్స్‌క్రిప్షన్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఇది వినియోగదారులు ప్రాసెస్‌ను మాన్యువల్‌గా ప్రారంభించడానికి అనుమతిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత WhatsApp టెక్స్ట్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. అసలు వాయిస్ నోట్ క్రింద ట్రాన్స్‌క్రిప్షన్ ఫలితాలను చూపిస్తుంది.