వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ తెచ్చింది వాట్సాప్. వాయిస్ నోట్స్‌లో ఏం చెప్పినా నోట్ చేసుకోవడం ద్వారా యూజర్ల టైం సేవ్ అవుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్‌ని చాట్స్‌లో యాక్సెస్ చేయొచ్చు. యాప్ సెట్టింగ్‌ల ద్వారా ఎనేబుల్ చేయొచ్చు. ఈ ఫీచర్ మొబైల్ యాప్‌కు మాత్రమే పనిచేస్తుంది. ఇంగ్లిష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, హిందీ అనే ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. అదెలాగంటే.. వాట్సాప్ యాప్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి.. చాట్‌పై క్లిక్ చేయాలి. ఫీచర్‌ని యాక్టివేట్ చేసేందుకు టోగుల్ బార్ కనిపిస్తుంది. యాక్టివేట్ చేశాక వాయిస్ నోట్స్ కింద ట్రాన్స్‌క్రిప్షన్ ప్రాంప్ట్ కనిపిస్తుంది.
దాన్ని క్లిక్ చేస్తే.. టెక్స్ట్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. దాంతో వాయిస్ నోట్ కింద ట్రాన్స్‌క్రిప్షన్ రిజల్ట్స్ డిస్‌ప్లే చేస్తుంది. వ్యక్తిగత వాయిస్ మెసేజ్‌లకు ఎండ్- టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ప్రొటెక్షన్ ఇస్తుంది. మెసేజ్ పంపినవాళ్లు, అందుకున్న వాళ్లు మాత్రమే వాటిని యాక్సెస్ చేయగలరు. వాట్సాప్ కూడా మెసేజ్‌లను వినదు. చదవదు. షేర్ చేయదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండింటికీ సంబంధం లేనట్టే. అంత ప్రైవసీ!