వాట్సప్‌లో కొత్త ఫీచర్ వాయిస్ మోడ్.. టైపింగ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వారికి ఇదో వరం

వాట్సప్ యూజర్లకు మరో కొత్త అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. AIతో కమ్యూనికేట్ చేయడానికి వాయిస్ చాట్ మోడ్ ఫీచర్‌పై పని చేస్తోంది. హ్యాండ్స్-ఫ్రీ కమ్యూనికేషన్‌ కోసం ప్రయత్నిస్తుంది. డైరెక్ట్‍గా వాయిస్ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకునే ఫీచర్ తీసుకువచ్చింది. వాట్సప్ యూజర్లు చాట్ బాట్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి AI తో వాయిస్ రిప్లైలు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది.

వాట్సాప్ iOS బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ ను  డెవలప్‌మెంట్‌ చేస్తున్నారు. మెటా AI ఫొటోలు, వాయిస్ టెక్ట్స్ ద్వారా అవతలి వారని కమ్యూనికేట్ చేయవచ్చు. వినికిడి సమస్యలు ఉన్న వ్యక్తులకు, విజువల్ కమ్యూనికేషన్‌ను ఇష్టపడే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. రియల్ టైమ్ వాయిస్ ఇంటరాక్షన్‌ల ద్వారా మెటా AIతో మీ ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వొచ్చు.  మెటా AI చాట్‌లో "ఇమాజిన్ మి" అని టైప్ చేస్తే మీ లాంటి కాటూన్ క్రియేట్ అవుతుంది. అది రియల్ టైమ్ వాయిస్ ఇంటరాక్షన్‌లా కన్వర్జేషన్ కు ఉపయోగపడుతుంది.