ఏం టెక్నాలజీరా బాబూ : వాట్సాప్​ వెబ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్

స్మార్ట్​ఫోన్​తో పాటు ల్యాప్​టాప్​, ట్యాబ్​, పీసీ లాంటి మరికొన్ని డివైజ్​ల్లో కూడా ‘వాట్సాప్​ వెబ్​’ వాడుతుంటారు. అయితే అలా వాడే డివైజ్​లతో వాట్సాప్​ కాంటాక్ట్స్​ సేవ్​ చేసుకునే అవకాశం లేదు. కొత్త కాంటాక్ట్ సేవ్​ చేయాలంటే ప్రైమరీ డివైజ్‌‌ని చేతిలోకి తీసుకోవాల్సిందే. లింక్డ్‌‌ డివైజెస్‌‌లో అప్పటికే సేవ్​ చేసిన కాంటాక్ట్‌‌ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది. ఈ సమస్యకు చెక్‌‌ పెడుతూ లింక్​ చేసిన డివైజ్​ల్లో కూడా కాంటాక్ట్‌‌ని సేవ్‌‌ చేసేలా కొత్త ఫీచర్‌‌ తెచ్చేందుకు వాట్సాప్‌‌ రెడీ అయ్యింది.

ఇప్పటివరకు వాట్సాప్​ ‘మొబైల్–ఓన్లీ కాంటాక్ట్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్‌‌’తో పనిచేసేది. కానీ.. ఇందులో మార్పు తీసుకురానుంది. ఇక నుంచి వాట్సాప్​ని ఏ డివైజ్​లో వాడుతున్నా.. అందులోనే కొత్త కాంటాక్ట్‌‌ని సేవ్​ చేసుకోవచ్చు.మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్​ని యూజర్లు అందరికీ తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతేకాదు.. ఈ ఫీచర్​లో మరో ప్రత్యేకత ఉంది.

అదేంటంటే సేవ్​ చేస్తున్న కాంటాక్ట్​ వాట్సాప్​లోనే సేవ్​ చేయాలా లేదా డివైజ్​ స్టోరేజీలో కూడా సేవ్​ చేయాలా? అనేది సెలక్ట్​ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్​ పోయినా, మార్చినా కాంటాక్ట్స్​ మాత్రం వాట్సాప్​లో సేవ్​ అవుతాయి. ఒకవేళ కొత్త డివైజ్​లో లాగిన్​ అయిన వెంటనే పాత కాంటాక్ట్స్​ అన్నీ రీస్టోర్​ అవుతాయి ఈ ఫీచర్​ వల్ల.