UPDATE : డబుల్ ట్యాప్​.. టైం సేవ్​

మెసేజింగ్​ యాప్స్​లో వాట్సాప్​ టాప్​! ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. అలా వచ్చిన మరో ఇంట్రెస్టింగ్​ ఫీచర్.. వాట్సాప్​ యూజర్ల ఫొటోలు, వీడియోలు, జిఫ్​ తోపాటు మల్టీ మీడియా కంటెంట్​కు షేర్​ చేయొచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్​లో రియాక్షన్ మాత్రమే ఎంచుకునే వీలు కల్పించింది. ఇప్పుడు వాట్సాప్​ ప్లాట్​ఫామ్​ నుంచే వేగంగా రియాక్ట్​ అయ్యే ఛాన్స్ ఇస్తోంది. అంటే.. రియాక్షన్​ కోసం టెక్స్ట్​ మెసేజ్​పై డబుల్ క్లిక్​ చేస్తే చాలన్నమాట. ఇలాంటి ఫీచర్​ ఇన్​స్టాగ్రామ్​లో ఇప్పటికే అందుబాటులో ఉంది. డబుల్ ట్యాప్​ రియాక్షన్ ద్వారా చాట్స్​కు యాక్సెస్ ఇస్తోంది. 

కారణం ఇదే..

దీనివల్ల వాట్సాప్​ ఇతర యూజర్లతో ఈజీగా కనెక్ట్​ అయ్యే వీలుంటుంది. ఈ ఫీచర్​ యూజర్లు కేవలం మెసేజ్​పై రెండుసార్లు ట్యాప్​ చేసి రెస్పాండ్​ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్​ రియాక్షన్​ ప్రాసెస్​ను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది. తద్వారా యూజర్లు తమ భావాలను త్వరగా తెలియజేయొచ్చు. అందుకోసం డిఫాల్ట్ హార్ట్​ ఎమోజీ ఉంటుంది. దీనివల్ల టైం సేవ్​ అవుతుంది. అయితే, ఈ అప్​డేట్​కి ఆప్షనల్​ లేదా డిజేబుల్​ ఆప్షన్​ ఉంటుందో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్​ దశలో ఉంది.