టెక్నాలజీ  :ఇకపై టైప్ చేయక్కర్లేదు!

వా ట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఆ ఫీచర్ ఏంటంటే వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ మెసేజ్‌లుగా మార్చుకోవచ్చు. వాయిస్ నోట్‌లను టెక్స్ట్ మెసేజ్‌లుగా స్క్రీన్​ పై చూడొచ్చు. ఈ ఫీచర్‌ వాడకంలోకి వచ్చాక వాయిస్ కామెంట్‌ లేదా ఏదైనా ఇంటర్వ్యూని యూజర్లు మరొక యాప్ అవసరం లేకుండా ఈజీగా టెక్స్ట్ మెసేజ్‌లుగా పంపించుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్ ఇంకా డెవలపింగ్​ స్టేజ్​లో ఉంది. వాయిస్ నోట్‌లను టెక్స్ట్‌కి మార్చే ఫీచర్‌పై పని చేస్తున్నారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విభాగంలో యూజర్లు స్పానిష్, పోర్చుగీస్, ఇంగ్లిష్, రష్యన్, హిందీతో పాటు అనేక భాషలను సెలక్ట్​ చేసుకోవచ్చు. ముందుముందు ఇతర భాషలను కూడా జోడించే అవకాశం ఉంది.