WhatsApp: వాట్సాప్ కాల్..మీరు ఎక్కడున్నారో చెబుతుంది.. ప్రైవసీ మెయింటెన్ చేయాలంటే..

వాట్సాప్..ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మేసేజింగ్ యాప్..భారత్ దేశంలో 550 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో పాటు వ్యాపారపరమైన మేసేజ్, ఆడియో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ యాప్ ల ద్వారా డిజిటల్ మోసాలు బాగా జరుగుతున్నాయని ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, రిపోర్టులు చెబుతున్నాయి. వాట్సాప్ సురక్షితమైన మేసేజింగ్ యాప్ అని చెబుతున్నప్పటికీ కొన్ని పొరపాట్లు సమస్య లకు దారి తీస్తున్నాయి.. 

వాట్సాప్ కస్టమర్లకు ఇటీవల ఓ కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే.. వాట్సాప్ ఆడియో  లేదా వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మన లోకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఇది మన ప్రైవసీకి చాలా ఆటంకం.. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే.. 

Also Read:-తిరుమల కొండపై.. ఏసుక్రీస్తు గుర్తులతో ఉన్న వస్తువుల అమ్మకం..

వాట్సాప్ ఆడియో కాల్ లేదా వీడియో కాల్ చేస్తున్నపుడు మన లోకేషన్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే సెట్టింగ్ లోకి  వెళ్లి కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. వాట్సాప్  కాల్స్ లో IP అడ్రస్ ప్రొటెక్ట్ అనే ఫీచర్ ఉంటుంది.. ఈ ఫీచర్ ను అవైలేబుల్ చేయడం ద్వారా కాల్స్ సమయంలో ఈ లోకేషన్ ను ట్రాక్ అవకుండా అడ్డుకోవచ్చు .

ఎలా చేయాలంటే.. 

  • మీ ఫోన్ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి. .
  • స్క్రీన్ పై భాగంలో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయాలి. 
  • సెట్టింగ్స్ సెలక్ట్ చేసుకొని ప్రైవసీ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. 
  • లేటెస్ట్ అనే లేబుల్ పై క్లిక్ చేయాలి. 
  • మీరు కాల్స్ లో IP అడ్రస్ ప్రొటెక్ట్  అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఈ ఫీచర్ ఆన్ చేయడం ద్వారా మీరు మీ లోకేషన్ ను ట్రాక్ చేయకుండా అడ్డుకోవచ్చు.