వాట్సాప్‌లో అందరికీ ఉపయోగపడే ఫీచర్ ఈ డిలీట్ ఫీచర్ అంటోంది కంపెనీ. వాట్సాప్ ఓపెన్ చేయగానే బోలెడన్ని మెసేజ్‌లతో నిండిపోయి ఉంటుంది. అది కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది. ఎందుకంటే వాటిలో పనికొచ్చే మెసేజ్‌లు కొన్నే ఉంటాయి. మిగతావి గ్రూప్స్‌లో వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్స్ వంటివి ఉండొచ్చు. అందుకే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెట్టేసింది వాట్సాప్ కంపెనీ.
అదేంటంటే.. చదవని (అన్‌రీడ్) మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. అయితే అవి ఎన్నిరోజుల తర్వాత డిలీట్ అవుతాయి అనే వివరాలు ఇంకా తెలియదు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది. టెస్టింగ్ పూర్తయ్యాక అందరు యూజర్లకు వాడుకలోకి వస్తుందట. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మాత్రం చాలామంది రిలీఫ్‌గా ఫీలవుతారు అనడంలో సందేహం లేదు.
ఫేవరెట్ చాట్ లిస్ట్
చాట్లిస్ట్లో ఫేవరెట్స్ అనే ఆప్షన్ని యాడ్ చేయబోతోంది వాట్సాప్. ఇష్టమైన వ్యక్తుల్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే రెగ్యులర్‌గా చాట్ చేసేవాళ్ల, నచ్చిన వాళ్లకోసం కాంటాక్ట్స్మొత్తం వెతకాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది.